ప్రియాంక అమ్మ ఇప్పటికీ పెళ్లిళ్లకు వెళ్లి పనులు చేస్తుంది: శివ | Sakshi
Sakshi News home page

ప్రియాంక వాళ్ల నాన్న చేసిన పొరపాటు వల్లే ఆమెకు ఇన్నీ కష్టాలు: శివ

Published Mon, Dec 11 2023 11:16 AM

Shiva Kumar Reveal Priyanka Jain Family Details - Sakshi

ప్రియాంక జైన్‌గా కంటే ఇప్పుడు బిగ్‌ బాస్‌ ప్రియాంక అనే పేరుతోనే ఆమెకు మంచి గుర్తింపు ఉంది. బుల్లితెరపై 'జానకి కలగనలేదు' సీరియల్‌తో ఆమె వెలుగులోకి వచ్చింది. అదే విదంగా  బుల్లితెర నటుడు శివ కుమార్‌తో ఆమె ప్రేమలో పడిన విషయం తెలిసిందే. చాలా ఏళ్లుగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు.  మౌనరాగం సీరియల్‌లో కలిసి నటించారు. అమ్ములుగా ప్రియాంక జైన్.. అంకిత్‌గా శివ కుమార్‌లు కనిపించారు. కెమెరా ముందే నటనతో జీవించిన వీళ్లు.. కెమెరా వెనుక కూడా రొమాంటిక్ జోడీగా మారారు.

ఈ క్రమంలో ప్రియాంకకు బిగ్‌ బాస్‌లోకి ఎంట్రీ అవకాశం రావడంతో ఆమెకు మరింత గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఆమె టాప్‌-5 కంటెస్టెంట్‌గా ఆమె ఉన్నారు. బిగ్‌ బాస్‌ హౌస్‌లో ప్రియాంక ఎక్కడా బ్యాలెన్స్‌ తప్పలేదని చెప్పవచ్చు. గేమ్‌లో తన హుందాతనాన్ని, సంస్కారాన్ని కోల్పోకుండా ఉండటం వల్ల టాప్‌-5 వరకు వచ్చింది. ఈ క్రమంలో కొందరు యాంటీ ఫ్యాన్స్‌ ఆమెను ట్రోల్‌ చేయడం కూడా జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక కుటుంబం గురించి శివ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

ప్రియాంక బిగ్‌ బాస్‌లో ఉండగా తన ఇంటికి సంబంధించిన హోమ్‌ టూర్‌ వీడియో ఒకటి భారీగా వైరల్‌ అయింది. ఆ వీడియోను చాలా రోజుల క్రితమే ఆమె యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేసింది. ఆ వీడియో చూసిన వారందరూ ప్రియాంక ఇంత పేదరికాన్ని చూసి ఈ స్థాయికి వచ్చిందా..? అని కొందరు ప్రశంసించారు. దీనిని జీర్ణించుకోలేని కొందరూ అదంతా ఓట్ల కోసం సింపతీ అనే విమర్శలు చేయడం ప్రారంభించారు.

ఈ విషయంపై శివ ఇలా సమాధానం చెప్పాడు. 'ఆ వీడియో పోస్ట్‌ చేసే సమయానికి ప్రియాంకకు బిగ్‌ బాస్‌ ఆఫర్‌ రాలేదు. నిజానికి ఆమె అక్కడే జన్మించింది. ప్రియాంక నాన్నగారిని వ్యాపారం పరంగా ఆయన స్నేహితుడు మోసం చేయడంతో ఆర్థికంగా భారీగా నష్టపోయారు. ఆ సమయంలో ఆ ఇల్లు అమ్మేసి ప్రస్తుతం బెంగళూరులో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. దానికి రూ. 15 వేలు రెంట్‌ అవుతుంది.. ఆ డబ్బు కూడా ప్రియాంకనే చెల్లిస్తుంది. ప్రియాంక అమ్మగారు ఇప్పుడు కూడా పెళ్లికూతురికి మేకప్‌ చేయడం.. మెహందీ పెట్టడం వంటివి చేస్తున్నారు. ఆమె నాన్నగారు ఒక చిన్న మొబైల్‌ షాప్‌ పెట్టుకుని కొనసాగుతున్నాడు.

చాలా పూర్‌ ఫ్యామిలీ నుంచి ఇంత దూరం ఆమె వచ్చింది. అలాంటి వ్యక్తిపై కూడా ఇలాంటి దారుణమైన ట్రోల్స్‌ చేయడం ఏంటి..? గేమ్‌లో భాగంగా వారు కొద్దిసేపు అరుచుకుంటారు.. మళ్లీ కలిసిపోతారు. అంతే గానీ బయట కొందరు పనిగట్టుకుని ఆమెను ఇంతలా ట్రోల్‌ చేయడం ఏంటి..? ట్రోల్‌ చేసే వారిలో ఎవరికైనా అన్యాయం చేసిందా అని ఆయన వ్యాఖ్యానించారు. ఆమెను ఎందరు ట్రోల్‌ చేసినా నేను ఆమెకు తోడుగా ఉంటూనే వాటిని ఎదుర్కుంటాను. అని ఆయన అన్నారు.

రేపటి రోజున 'శివాజీ' కూడా స్టార్‌ మా బ్యాచ్‌నే 
ప్రియాంక, శోభ, అమర్‌ దీప్‌ను చాలా మంది 'స్టార్‌ మా బ్యాచ్‌' అంటూ ట్రోల్‌ చేస్తూన్నారని శివ తెలిపాడు. ఈ వ్యాఖ్యలు మొదట చేసింది శివాజీ గారే అంటూ ఆయన చెప్పాడు. బిగ్‌ బాస్‌ కూడా 'స్టార్‌ మా' ఛానెల్‌లోనే వస్తుంది. రేపొద్దున బిగ్‌ బాస్‌ పూర్తి అయ్యాక వీరందరూ బయటకు వస్తారు... అప్పుడు శివాజీ, పల్లవి ప్రశాంత్‌ వంటి వారితో పాటు అందరూ కూడా 'స్టార్‌ మా బ్యాచ్‌'నే అవుతారు. ఎందుకంటే వారందరూ కూడా 'స్టార్‌ మా' ఛానెల్‌ కోసం పనిచేశారు. అందులో తప్పేముంది..? ఇలాంటి విషయం లేని ట్రోల్స్‌ చేయడం ఎందుకు..? అని శివ ప్రశ్నించాడు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement