Sharwanand Aadavaallu Meeku Joharlu Teaser - Sakshi
Sakshi News home page

Sharwanadh: ఆకట్టుకుంటున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ టీజర్‌

Feb 10 2022 7:45 PM | Updated on Feb 10 2022 8:18 PM

Sharwanadh Aadavaallu Meeku Johaarlu Movie Teaser Relesed - Sakshi

యంగ్‌ హీరో శర్వానంద్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.  కిశోర్​ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్​ బ్యానర్​పై సుధాకర్​ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ స్పీడు పెంచిన చిత్ర బృందం తాజాగా టీజర్‌ను రిలీజ్ చేసింది.  ప్రతి మోగాడి జీవితం పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం అనే శర్వానంద్‌ డైలాగ్‌తో టీజర్‌ ముదలవుతోంది.

ఎంతో మంది పెళ్లి చూపులు చూసిన హీరో వారందరిని రిజెక్ట్‌ చేస్తాడు. చివరకు హీరోయిన్‌ను ఒకే చేస్తాడు. కానీ హీరోని హీరోయిన్‌ రిజెక్ట్‌ చేస్తుంది. ఈ లైన్ పైనే కామెడీని వర్కౌట్ చేశాడు దర్శకుడు. ఇక చివరిసారిగా హీరో .. హీరోయిన్ పైనే ఆశలు పెట్టుకుంటాడు. కానీ ఆమె కూడా ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేస్తుంది. అప్పుడు హీరో ఏం చేశాడనేదే కథ. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమాలో సీనియర్‌ నటి రాధిక శరత్‌ కుమార్‌, ఖుష్బూ సందర్‌, ఊర్వశిలు ముఖ్యమైన పాత్రలో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement