బ్రిటిష్‌ సైనికుడు | Senior Actor Srikanth Intense First Look Revealed from Sai Durga Tej Pan-India Epic SYG | Sakshi
Sakshi News home page

బ్రిటిష్‌ సైనికుడు

Mar 24 2026 2:59 AM | Updated on Mar 24 2026 2:59 AM

Senior Actor Srikanth Intense First Look Revealed from Sai Durga Tej Pan-India Epic SYG

‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌వైజీ’  (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్‌ కేపీ దర్శకునిగా పరిచయమవుతుండగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్  మెంట్‌పై ‘హను–మాన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తెరకెక్కించిన కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నటుడు శ్రీకాంత్‌ పవర్‌ ఫుల్‌ పాత్ర చేస్తున్నారు.

మార్చి 23న ఆయన బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ మూవీలో శ్రీకాంత్‌ పోషించిన బ్రిటిష్‌ పాత్ర పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘ప్రతి గాయాన్ని ఒక పతకంలా ధరించే సైనికుడిగా శ్రీకాంత్‌ కనిపించనున్నారు. ఆయన లుక్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీ ద్వారా సాయి దుర్గాతేజ్‌ ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్‌పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘అసుర ఆగమన’ గ్లింప్స్‌కి సూపర్‌ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement