సారంగదరియా: ఆ క్రెడిట్‌, డబ్బులు కోమలికే! | Sekhar Kammula respond on Saranga Dariya song | Sakshi
Sakshi News home page

ఆ క్రెడిట్‌.. డబ్బులు కోమలికే!

Mar 11 2021 2:47 AM | Updated on Mar 11 2021 8:16 AM

Sekhar Kammula respond on Saranga Dariya song - Sakshi

‘లవ్‌ స్టోరీ’ చిత్రంలోని ‘సారంగ దరియా..’ అనే పాట ఎంత హిట్‌ అయిందో తెలిసిందే. అయితే ఈ పాటపై వివాదాలు కూడా నెలకొన్నాయి. ‘‘సారంగ దరియా..’ అనే పాటను నేనే వెలుగులోకి తీసుకొచ్చాను.. ‘లవ్‌ స్టోరీ’ సినిమాలో ఆ పాట నాతో పాడిస్తామని చెప్పి, పాడించలేదు’ అంటూ గాయని కోమలి మీడియాతో చెప్పిన మాటలు వివాదంగా మారాయి. దీనిపై ‘లవ్‌ స్టోరీ’ చిత్రదర్శకుడు శేఖర్‌ కమ్ముల ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘చాలా ఏళ్ల కిందట ‘రేలా రే రేలా’ ప్రోగ్రాంలో  శిరీష అనే అమ్మాయి పాడిన ‘సారంగ దరియా’ పాట నా మనసులో తిరుగుతూనే  ఉంది.

‘లవ్‌ స్టోరీ’కి తగ్గట్టు ‘సారంగ దరియా’ పాట రాయాలని సుద్దాల అశోక్‌ తేజగారిని కలిశా. ఆయన ఆ పాట పల్లవి తీసుకుని, ప్రత్యేకంగా చరణాలు రాశారు. ఆ పాటని శిరీషతో పాడిద్దామనుకున్నాం. అయితే పాటను తొలుత వెలుగులోకి తీసుకొచ్చిన కోమలితో పాడిద్దామని సుద్దాలగారు అన్నారు. వరంగల్‌ నుంచి ఆమెని రమ్మని కోరాం.. జలుబు, దగ్గు ఉండటం వల్ల రాలేను అన్నారు. అప్పటికే చెన్నై నుంచి సంగీత దర్శకుడు రికార్డింగ్‌ కోసం వచ్చి ఉండటంతో మంగ్లీతో పాడించాం. ఆ పాట క్రెడిట్‌తో పాటు డబ్బులు ఇస్తామని కోమలికి చెబితే సరేనన్నారు. పాట రిలీజ్‌ తర్వాత టీవీల్లో వచ్చిన కోమలి చర్చలు నేను చూడలేదు. ఈ పాట క్రెడిట్‌ తప్పకుండా ఆమెకి ఇవ్వడంతో పాటు మేము ఇస్తామన్న డబ్బులూ ఇస్తాం. ఆడియో వేడుకలో తనతో పాట పాడిస్తా’’ అన్నారు శేఖర్‌ కమ్ముల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement