యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షురూ | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షురూ

Published Sat, Oct 1 2022 3:39 AM

Satyadev new movie launch - Sakshi

సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం షురూ అయింది. ఈ చిత్రానికి ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘పుష్ప’తో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు డాలీ ధనంజయ ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శుక్రవారం ప్రారంభమైంది.

‘‘క్రైమ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న మల్టీస్టారర్‌ చిత్రమిది. సత్యదేవ్, ధనంజయల కెరీర్‌లో ఈ సినిమా ఇరవై ఆరవది కావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మణికంఠన్‌ కృష్ణమాచారి, సంగీతం: చరణ్‌ రాజ్‌.   
∙™డాలీ ధనంజయ, సత్యదేవ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement