ఛా.. నిన్ను తీసుకుని తప్పు చేశా.. నటుడిపై సెటైర్లు | Sakshi
Sakshi News home page

'ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా..' అక్కర్లేదంటూ సందీప్‌ కౌంటర్‌

Published Fri, Apr 19 2024 6:19 PM

Sandeep Reddy Vanga Burning With His Tweet In Response To Adil Hussain Statement About Kabir Singh - Sakshi

కబీర్‌ సింగ్‌.. కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ కొందరికి నచ్చింది. మరికొందరికి నచ్చలేదు. ఇందులో కాలేజీ డీన్‌గా నటించిన అదిల్‌ హుస్సేన్‌కు కూడా సినిమా నచ్చలేదట! తన సినీ కెరీర్‌లో ఎందుకు నటించాన్రా దేవుడా.. అని ఫీలైన సినిమా ఏదైనా ఉందంటే.. అదే కబీర్‌ సింగ్‌ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 'అందులో యాక్ట్‌ చేయనని చెప్తే కేవలం ఒక్క రోజే రమ్మని అడిగారు. భారీ పారితోషికం డిమాండ్‌ చేస్తే వాళ్లే సైలెంట్‌గా ఉంటారనుకున్నాను.

డబ్బులెక్కువ డిమాండ్‌ చేశా
కానీ నేను డిమాండ్‌ చేసిన మొత్తం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. దీంతో తప్పనిపరిస్థితిలో నేను సినిమా చేశాను. నేను నటించిన సన్నివేశం బాగానే ఉంది. సినిమా అంతా కూడా అలాగే ఉంటుందనుకున్నాను. మూవీ రిలీజైన తర్వాత చూస్తే.. ఇలాంటి సినిమా చేశానా? అని సిగ్గుతో చచ్చిపోయాను. నా భార్యను కూడా సినిమా చూడమని అడగలేదు. తను చూసుంటే ఇలాంటి మూవీలో యాక్ట్‌ చేశావా? అని నాపై కోప్పడేది' అని చెప్పుకొచ్చాడు.

ఒక్క బ్లాక్‌బస్టర్‌తో గుర్తింపు
ఇది చూసిన కబీర్‌ సింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా సోషల్‌ మీడియాలో సదరు నటుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. 'మీరు గొప్పగా భావించి యాక్ట్‌ చేసిన 30 సినిమాలతో రాని గుర్తింపు.. ఎందుకు నటించానా? అని బాధపడుతున్న ఈ ఒక్క బ్లాక్‌బస్టర్‌ చిత్రంతోనే వచ్చింది. మిమ్మల్ని సినిమాలోకి తీసుకున్నందుకు నేను బాధపడుతున్నాను. మీకు నటనపై అభిరుచి కంటే దురాశే ఎక్కువుందని అర్థమవుతోంది.

మీరు బాధపడక్కర్లేదు
మీరు సిగ్గుతో తలదించుకోకండి.. మీ ముఖాన్ని ఏఐ సాయంతో రీప్లేస్‌ చేస్తాను.. అప్పుడు మనసారా నవ్వుకోండి' అని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. దీనిపై అదిల్‌ హుస్సేన్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ.. కబీర్‌ సింగ్‌ సినిమా చూసి నేను షాకైన మాట వాస్తవం. ఇప్పటికీ ఆ మూవీలో నటించినందుకు రిగ్రెట్‌గా ఫీలవుతున్నాను. అభిప్రాయాన్ని మార్చుకునే ఉద్దేశ్యం నాకు లేదు అని చెప్పుకొచ్చాడు.

చదవండి: డ్రగ్స్ కేసులో షారుఖ్‌ కుమారుడికి క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి సంచలన నిర్ణయం

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement