Samantha Shares About Good News In Her Latest Instagram Post - Sakshi
Sakshi News home page

Samantha: ‘గుర్తు పెట్టుకోండి.. శుభవార్తలు వస్తాయి’ సామ్‌ పోస్ట్‌ వైరల్‌

Nov 12 2021 8:16 PM | Updated on Nov 13 2021 5:15 PM

Samantha Shares About Good News In Her Latest Instagram Post - Sakshi

Samantha Shares New Post About Good News: నాగ చైతన్యతో విడిపోయినప్పటి నుంచి సమం సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటోంది. విడాకుల ప్రకటన అనంతరం తను ఏం చెప్పాలనుకున్నా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారానే మాట్లాడుతున్నారు. ఇక తన బాధను, భావోద్యేగాలను సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. అలాగే తరచూ ఏదోఒక పోస్ట్‌ను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ ప్రస్తుత తన కండీషన్‌ చెప్పే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఆమె పెట్టిన ప్రతి పోస్ట్‌ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సామ్‌ మరో పోస్ట్‌ను షేర్‌ చేసింది. ఎప్పుడూ నిరాశతో, లేదా ఎమోషనల్‌ కోట్స్‌ షేర్‌ చేసే సమంత ఈసారి ఓ ఆసక్తికర కోట్‌ని షేర్ చేసింది.

చదవండి: అయ్యో సుమ కష్టాలు చూశారా! నా వల్ల కాదంటున్న యాంకర్‌

‘గుర్తు పెట్టుకోండి.. ఎల్లప్పుడూ ఏదైన శుభవార్త వస్తూనే ఉంటుంది’ అని రాసి ఉన్న ఫొటోను పంచుకుంది. దీంతో సమంత కాస్తా బాధ నుంచి బయట పడే ప్రయత్నం చేస్తోందని, ఆమె సంతోషించే న్యూస్‌ ఏదో తన వద్దకు చేరినట్టుందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా ప్రస్తుతం సమంత తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. అలాగే తెలుగులో ఆమె నటించిన ‘శాకుంతలం’ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకని విడుదలకు సిద్దమవుతోంది.  

చదవండి: 
అలాంటి పాత్రలో నటించాలని ఉంది, కథ కోసం ఎదురు చూస్తున్నా: సాయి పల్లవి
‘నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఓ ట్రాన్స్‌జెండర్‌.. ఎన్నో ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశాను’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement