అలాంటి పాత్రలో నటించాలని ఉంది, కథ కోసం ఎదురు చూస్తున్నా: సాయి పల్లవి | Sai Pallavi Said She Wants To Work In Comedy Movies | Sakshi
Sakshi News home page

Sai Pallavi: ‘ఈ సారి కొత్తగా కనిపించాలనుకుంటున్నా, ఆ ఛాన్స్‌ కోసం వెయిటింగ్‌’

Nov 12 2021 7:27 PM | Updated on Nov 12 2021 8:09 PM

Sai Pallavi Said She Wants To Work In Comedy Movies - Sakshi

ద‌క్షిణాది టాప్‌ హీరోయిన్లలో సాయిప‌ల్ల‌వి ఒకరు. చేసింది కొన్ని సినిమాలే అయిన మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నారామె. అందం, అభిన‌యంతో పాటు అద్బుత‌మైన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆమె ‘ఫిదా’ చేస్తున్నారు. చిన్న‌, పెద్ద సినిమాల‌నే తేడా లేకుండా క‌థా బ‌ల‌మున్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. స్క్రిప్ట్‌, పాత్ర న‌చ్చ‌క‌పోతే ప‌క్క‌న పెట్టేస్తారు.

చదవండి: అయ్యో సుమ కష్టాలు చూశారా! నా వల్ల కాదంటున్న యాంకర్‌

మొదటి నుంచి సీరియ‌స్ రోల్స్, బాధ్య‌త‌తో కూడిన పాత్ర‌ల్లో క‌నిపిస్తూ వ‌స్తున్న సాయిపల్లవి ఈ సారి కొత్తగా కనిపించాలనుకుంటున్నారట. ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నటిగా తనతో తాను కోరుకుంటున్న కొత్త మార్పు గురించి కూడా ప్రస్తావించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘నాలో కామెడీ యాంగిల్‌ను ప్రేక్ష‌కుల‌కు చూపించాల‌ని ఉంది. కామెడీ టైమింగ్‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా చూపించే స‌రైన క‌థ కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు.

చదవండి: ‘నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఓ ట్రాన్స్‌జెండర్‌.. ఎన్నో ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశాను’

ఇక ఇప్ప‌టివ‌ర‌కు గ్లామ‌ర‌స్‌, పర్ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్ సినిమాల‌తో అంద‌రినీ ప‌లుక‌రించిన సాయిప‌ల్ల‌విలో కామెడీ యాంగిల్ కూడా ఉంద‌ట. అందుకే వీలైనంత కామెడీతో అంద‌రిని నవ్వించే ప్రుయత్నం చేస్తానని సాయి పల్లవి పేర్కొన్నారు. కాగా ఇటీవల శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో ఆమె నటించిన లవ్‌స్టోరీ మూవీ ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నాని శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ గా క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement