Samantha On Evaru Meelo Koteeswarulu First Appearance After Divorce - Sakshi
Sakshi News home page

Samantha: ఎన్టీఆర్‌తో సమంత సందడి.. విడాకుల తర్వాత తొలిసారి అలా..!

Oct 7 2021 5:16 PM | Updated on Oct 7 2021 6:16 PM

Samantha on Evaru Meelo Koteeswarulu First Appearance After Divorce - Sakshi

ChaySam Divorce: నాగ చైతన్య -సమంతల విడాకుల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ది టౌన్‌గా మారింది. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన వీరి గురించే చర్చించుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న  చై-సామ్‌లు విడిపోవడాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే నాగ చైతన్య, సమంతలు మాత్రం జరిగిన విషయాన్ని మర్చిపోయి తమ, తమ పనుల్లో నిమగ్నులైనట్లు తెలుస్తోంది.

విడాకుల తర్వాత నాగచైతన్య ఇప్పటికే లవ్ స్టోరీ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. అలాగే త్వరలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా కూడా కనిపించబోతున్నాడు. అయితే సమంత మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి కార్యక్రమంలో నేరుగా కనిపించలేదు. తాజాగా ఆమె ఎన్టీఆర్ షోలో కనిపించబోతోంది అంటూ ప్రచారం జరుగుతోంది.

ఆ వివరాల్లోకి వెళితే..యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’. జెమిని టీవీలో ప్రసారమవుతున్న ఈ షో మొదటి ఎపిసోడ్‌కి రామ్‌ చరణ్‌ గెస్ట్‌గా వచ్చాడు. ఆ తర్వాత స్టార్ డైరెక్ట‌ర్లు రాజ‌మౌళి-కొర‌టాల శివ ఈ కార్య‌క్ర‌మంలో సంద‌డి చేశారు. ఇక ఈ బిగ్‌ రియాల్టీ షోకి మహేశ్‌ బాబు కూడా గెస్ట్‌గా విచ్చేశాడు. దానికి సంబంధించి ప్రోమో కూడా విడుదల చేశారు. దసరాకు ఈ ఎపిసోడ్‌ ప్రసారం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజా ఈ షోకి స్టార్‌ హీరోయిన్‌ సమంత గెస్ట్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన ఎపిసోడ్‌ షూటింగ్‌ కూడా పూర్తయినట్లు టాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ స్పెష‌ల్ ఎపిసోడ్ ఈ నెల చివ‌ర‌లో కానీ..వ‌చ్చే నెల ప్రారంభంలో కాని ప్ర‌సారం కానుంద‌ని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement