‘ఆదిపురుష్‌’ సెట్‌లో సెలబ్రెషన్స్‌, రావణ్‌ షూటింగ్‌ పూర్తి | Saif Ali khan Wraps Up His Part Of Shooting In Adipurush Movie | Sakshi
Sakshi News home page

‘ఆదిపురుష్‌’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న లంకేశ్వరుడు

Oct 10 2021 12:33 PM | Updated on Oct 10 2021 12:33 PM

Saif Ali khan Wraps Up His Part Of Shooting In Adipurush Movie - Sakshi

ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘ఆదిపురుష్‌’. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతీసనన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ కనిపిస్తారు. సైఫ్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. దీంతో ‘బై బై రావణా’ అంటూ కేక్‌ కట్‌ చేసి, సెలబ్రేట్‌  చేసింది చిత్రబృందం.

ఈ సెలబ్రేషన్‌ ఫోటోలను సామాజిక మాధ్యమాల వేదికగా షేర్‌ చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ దాదాపు 85 రోజులుగా జరుగుతోంది. ఇంకొన్ని రోజులు జరిపితే సినిమా పూర్తవుతుంది. అయితే గ్రాఫిక్స్‌ వర్క్స్‌కు ఎక్కువ సమయం పట్టేలా ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement