నిద్రమాత్రలు వేసుకున్న హీరో.. భార్యే ఇచ్చింది.. ఎందుకంటే? Saif Ali Khan Take Sleeping Pills to While Shooting In Hum Saath Saath Hain. Sakshi
Sakshi News home page

హీరోకు నిద్రమాత్రలు వేసిన మాజీ భార్య.. ఇన్నాళ్లకు బయటపెట్టిన దర్శకుడు

Jun 7 2024 1:29 PM | Updated on Jun 7 2024 3:05 PM

Saif Ali Khan Take Sleeping Pills to While Shooting In Hum Saath Saath Hain

అలాంటి వ్యక్తి ఒకానొక సమయంలో రీటేకులు తీసుకుంటూనే ఉన్నాడు. అసలేమైంది? అని అతడి భార్య అమృత సింగ్‌ను(ప్రస్తుతం విడాకులు తీసుకున్నారు) అడిగాను.

బాలీవుడ్‌లోని క్లాసిక్‌ చిత్రాల్లో 'హమ్‌ సాత్‌ సాత్‌ హై' ఒకటి. ఇప్పుడు చూసినా ఎంతో ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఈ మూవీలో సల్మాన్‌ ఖాన్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, కరిష్మా కపూర్‌, టబు, సోనాలి బింద్రె, మోనిశ్‌ బాల్ తదితరులు పటించారు. దర్శకుడు సూరజ్‌ బార్జాత్యాతో కలిసి పని చేసి ఈ మాస్టర్‌పీస్‌ను అందించారు. అయితే ఈ సినిమాలోని 'సునోజి దుల్హాన్‌..' పాట షూటింగ్‌ సమయంలో సైఫ్‌ అలీ ఖాన్‌ సరిగా యాక్ట్‌చేయలేదట.

నిద్రమాత్రలు వేసుకుని..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సూరజ్‌ ఆనాటి విషయాలను పంచుకున్నారు. 'సైఫ్‌ అలీ ఖాన్‌ సహజ నటుడు. అలాంటి వ్యక్తి ఒకానొక సమయంలో రీటేకులు తీసుకుంటూనే ఉన్నాడు. అసలేమైంది? అని అతడి భార్య అమృత సింగ్‌ను(ప్రస్తుతం విడాకులు తీసుకున్నారు) అడిగాను. పగలూరాత్రీ తేడా లేకుండా మెళకువతో ఉంటే తను ఎలా పర్ఫెక్ట్‌గా నటించగలడు? అని చెప్పింది. తనకేదైనా మెడిసిన్‌ ఇవ్వమన్నాను. అలా అతడికి నిద్ర మాత్రలు ఇవ్వడంతో ఆ రోజు హాయిగా పడుకున్నాడు.

నేచురల్‌ యాక్టర్‌
తెల్లారి సెట్‌లో సింగిల్‌ టేక్‌లో తన షాట్‌ పూర్తి చేశాడు. ఒక్క టేక్‌లో ఎలా పూర్తయింది? అని ఆశ్చర్యంగా నన్నే తిరిగి అడిగాడు. నువ్వు కంటి నిండా నిద్రపోతేనే నేచురల్‌గా నటించగలవని బదులిచ్చాను. పెద్ద స్టార్స్‌తో కలిసి నటించడం సైఫ్‌కు అదే తొలిసారి కావడంతో కొంత బెరుకుగా కూడా ఉండేవాడు. తన డైలాగులను ఎప్పటికప్పుడు రిహార్సల్స్‌ చేసేవాడు' అని డైరెక్టర్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సైఫ్‌ అలీ ఖాన్‌ దేవర సినిమాలో నటిస్తున్నాడు.

చదవండి: ‘సత్యభామ’ మూవీ రివ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement