నిర్మాతను పెళ్లాడిన ప్రముఖ నటి.. ఫోటోలు షేర్ చేసిన ముద్దుగుమ్మ! | Sacred Games Actress Sukhmani Sadana Marries Producer Sunny Gill | Sakshi
Sakshi News home page

Sacred Games Actress: నిర్మాతతో పెళ్లి.. ఆలస్యంగా బయటపెట్టిన బ్యూటీ!

Published Fri, Mar 8 2024 2:34 PM | Last Updated on Fri, Mar 8 2024 3:17 PM

Sacred Games Actress Sukhmani Sadana Marries Producer Sunny Gill  - Sakshi

సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల జోరు మామూలుగా లేదు. ఈ ఏడాదిని వివాహాల సంవత్సరంగా పేరు మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కొత్త ఏడాదిలో సినీ ప్రముఖులు చాలామంది పెళ్లిబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడిని పెళ్లాడగా.. త్వరలోనే కృతి కర్బందా, మీరా చోప్రా కూడా వెడ్డింగ్‌కు సిద్ధమయ్యారు. తాజాగా మరో బాలీవుడ్ భామ పెళ్లి చేసుకుంది. నిర్మాతను పెళ్లాడిన ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందాం. 

ప్రముఖ నటి సుఖ్‌మణి సదానా వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన సన్నీ గిల్‌ను మార్చి 3, 2024 పెళ్లాడారు.  అమృత్‌సర్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దాదాపు మూడూ రోజుల పాటు అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. 

పెళ్లయిన విషయాన్ని కాస్తా ఆలస్యంగా అభిమానులతో పంచుకుంది ముద్దుగుమ్మ. తన పెళ్లి ఫోటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. మా జీవితంలో అత్యంత అందమైన రోజు ఇది.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ నటి పోస్ట్ చేసింది. కాగా.. సుఖ్‌మణి సదానా సాక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌లో నటించింది.  అంతే కాకుండా జోగి, రాకెట్రీ వంటి చిత్రాలకు స్క్రిప్ట్‌ అందించారు. వీటితో పాటు తాండవ్, ఉడాన్ పటోలాస్, తనవ్, మన్మర్జియాన్ లాంటి షోలలో కూడా కనిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement