సరిగమప 16వ సీజన్‌కు ముహూర్తం ఫిక్స్‌ | Sa Re Ga Ma Pa Telugu 16th Season Launching Details, Check Starting Date And Other Details | Sakshi
Sakshi News home page

సరిగమప 16వ సీజన్‌కు ముహూర్తం ఫిక్స్‌

Sep 25 2024 9:25 PM | Updated on Sep 26 2024 10:37 AM

Sa Re Ga Ma Pa Telugu 16th Season Launching Details

సంగీత పరిశ్రమలో ముద్రపడిపోయిన ట్రెండ్‌లను అనుకరించడం కన్నా సృజనాత్మకతతో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్‌లను సృష్టించేవారు చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ సంగీత దర్శకులు కోటి తెలిపారు. జీ తెలుగు వేదికగా ప్రేక్షకాదరణ పోందిన ప్రముఖ షో సరిగమప 16 వ సీజన్‌ ఈ నెల 29న ప్రారంభం కానుంది. 

ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో సరిగమప న్యాయనిర్ణేత కోటీ మాట్లాడుతూ., దాదాపు 5 వేల మందిలో అత్యుత్తమ కళా నైపుణ్యాలున్న 26 మందిని ఎంపిక చేశామన్నారు. ప్రస్తుతం ఏఐ వంటి మాధ్యమాలు వచ్చి నకిలీ సంగీతాన్ని సృష్టిస్తున్నాయని., ఇలాంటి ఎన్ని సాంకేతికతలు వచ్చినా స్వచ్చమైన, సహజమైన నంగీతం ఎప్పుడూ తన ప్రశస్తిని పెంచుకుంటూ పోతుందన్నారు.

ప్రముఖ లిరిసిస్ట్‌ శ్యామ్‌ క్యాసర్ల ఈ సీజన్‌లో జడ్జిగా వ్యవహారించనున్నారు. మట్టిలో మాణిక్యాలను ప్రముఖ సింగర్లుగా వెలుగొందేలా సానబెడతామన్నారు. రెండు తరాలకు మధ్య వారధిలా సంగీత, సాహిత్య అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని  శ్యామ్‌ అన్నారు. ఈ సీజన్‌లో విలేజ్‌ వోకల్స్‌, సిటీక్లాసిక్స్‌, మెట్రో మెలోడీస్‌ అనే 3 జట్లుగా పోటీలు కొనసాగుతాయని మరో జడ్జి ఎస్పీ శైలజ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్లు రువంత్‌, రమ్య, అనుధీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement