రోషన్‌ చేతిలో రెండు పాన్‌ ఇండియా చిత్రాలు | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌.. ఒకేసారి రెండు చిత్రాలు..

Published Thu, Jul 13 2023 4:13 AM

Roshan Meka is two pan India films - Sakshi

‘నిర్మలా కాన్వెంట్‌’ (2016)లో లీడ్‌ రోల్‌ చేసి, ‘పెళ్లి సందడి’ (2021)తో హీరోగా మంచి మార్కులు తెచ్చుకున్నారు నటుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ మేకా. ఇప్పుడు పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌తో హీరోగా సినిమాలు సైన్‌ చేశారు. రోషన్‌ ఒకేసారి రెండు పాన్‌ ఇండియా చిత్రాలు అంగీకరించడం విశేషం.

కన్నడ దర్శకుడు నందకిశోర్‌ దర్శకత్వంలో రోషన్‌–మోహన్‌లాల్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న పాన్‌ ఇండియా చిత్రం షూటింగ్‌ ఈ నెలాఖరులో ఆరంభం కానుంది. తండ్రీ–కొడుకుల అనుబంధం నేపథ్యంలో పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీగా రూపొందనుంది. రోషన్‌ నటించనున్న మరో పాన్‌ ఇండియా చిత్రం వైజయంతీ మూవీస్‌–స్వప్నా సినిమా బేనర్లపై రూపొందనుంది. నూతన దర్శకుడు ప్రదీప్‌ అద్వైతం ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

Advertisement
 
Advertisement