దర్శకుడు రాఘవేంద్రరావు ఇంట విషాదం | RK Films Chief Kovelamudi Krishna Mohan Rao Passed Away | Sakshi
Sakshi News home page

దర్శకుడు రాఘవేంద్రరావు ఇంట విషాదం

Mar 24 2021 2:03 PM | Updated on Mar 25 2021 1:38 AM

RK Films Chief Kovelamudi Krishna Mohan Rao Passed Away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు సోదరుడు, నిర్మాత కోవెలమూడి కృష్ణమోహన్‌ రావు (81) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. కృష్ణతో ‘భలే కృష్ణుడు’,  మోహన్‌ బాబుతో ‘అల్లరి మొగుడు’, చిరంజీవితో ‘యుద్ధభూమి’, (చిరు నటించిన ‘ఇద్దరు మిత్రులు’ని రాఘవేంద్రరావుతో కలిసి నిర్మించారు) బాలకృష్ణతో ‘అపూర్వ సహోదరులు, మహేశ్‌బాబుతో ‘బాబీ’ తదితర చిత్రాలను కృష్ణమోహన్‌ రావు నిర్మించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జూబ్లీ హిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు గురువారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణమోహన్‌ రావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement