ప్ర‌ముఖ‌ అమెరిక‌న్ టీవీ హోస్ట్ క‌న్నుమూత‌

Regis Philbin, Famous TV Host Passes Away at 88 - Sakshi

లాస్ ఏంజిల్స్: బ్రిటీష్ గేమ్ షో "హూ వాంట్స్ టు బి ఎ మిలియ‌నీర్" కార్య‌క్ర‌మం స‌రిహ‌ద్దులు దాటుతూ మిగ‌తా దేశాల‌కు వ్యాప్తి చెందింది. అమెరికాలో ఈ షో వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించే రెజిస్ ఫిల్‌బిన్(88) శుక్ర‌వారం రాత్రి క‌న్ను మూశారు. కాగా ఆయ‌న గ‌త నెల‌లోనే పుట్టిన‌రోజు జ‌రుపుకున్నారు. ఇక లాస్ ఏంజిల్స్‌లో త‌న బుల్లితెర ప్ర‌యాణాన్ని ప్రారంభించిన ఆయ‌న‌ 'హూ వాంట్స్ టు బి ఎ మిలియ‌నీర్' కార్య‌క్ర‌మానికి కొన్ని ద‌శాబ్దాలుగా వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ ప్రోగ్రామ్‌ వారంలో ఐదు రోజుల పాటు ప్ర‌సార‌మ‌య్యేది. ఇది టీవీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ఆదాయం గ‌డించిన‌ టెలివిజ‌న్ షోగా‌ కీర్తి గ‌డించింది. ఈ కార్య‌క్ర‌మం ప్రారంభమైన తొలి రెండు సంవ‌త్స‌రాల్లో 1 బిలియ‌న్ డాల‌ర్లు ఆర్జించింది. (డాడీ బాండ్‌)

ఈ షో వ‌ల్ల ఫిల్‌బిన్‌ పాపులారిటీతో పాటు ఎక్కువ మొత్తంలో డ‌బ్బులు సంపాదించారు. ముఖ్యంగా ఈ కార్య‌క్ర‌మంలో అత‌ని డైలాగ్ "ఈజ్ ద‌ట్ యువ‌ర్ ఫైన‌ల్ ఆన్స‌ర్‌?(ఇదే మీ ఆఖ‌రి స‌మాధానమా)" ఇప్ప‌టికీ చాలామంది నోళ్ల‌లో నానుతూనే ఉంటుంది. అలాగే ఆయ‌న వ‌స్త్ర ధార‌ణ భిన్నంగా ఉండి ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచేది. డేటైమ్ ఎమ్మీస్ నుంచి ఆయ‌న‌ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. 'లైవ్ విత్ కెల్లీ అండ్ రియాన్'‌, 'ద రెజిస్ ఫిల్‌బిన్' కార్య‌క్ర‌మాల‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇదిలా వుండ‌గా 'హూ వాంట్స్ టు బి ఎ మిలియ‌నీర్' కార్య‌క్ర‌మం భార‌త్‌లో 'కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి', 'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు?' వ‌ంటి ప‌లు పేర్ల‌తో అత్యంత ఆద‌ర‌ణ సంపాదించుకుంది. (హాలీవుడ్‌ కంపోజర్‌ మోరికోన్‌ మృతి )

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top