లేటు వయసులో పెళ్లి చేసుకున్న జైలర్‌ నటుడు, ఫోటోలు వైరల్‌ | Sakshi
Sakshi News home page

Redin Kingsley: 46 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌.. నటితో ఏడడుగులు..

Published Sun, Dec 10 2023 4:32 PM

Redin Kingsley Ties the Knot With Actress Sangeetha - Sakshi

ప్రముఖ కమెడియన్‌ రెడిన్‌ కింగ్‌స్లీ లేటు వయసులో పెళ్లిపీటలెక్కాడు. 46 ఏళ్ల వయసున్న ఇతడు బుల్లితెర నటి సంగీత మెడలో మూడుముళ్లు వేశాడు. ఇరుకుటుంబ సభ్యులు, అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఆదివారం జరిగిన ఈ శుభకార్యానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. నటుడు, డ్యాన్సర్‌ సతీష్‌ కృష్ణన్‌ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త జంట పెళ్లి ఫోటోలను షేర్‌ చేశాడు.

అలాగే ఇదేమీ సినిమా షూటింగ్‌ కాదని, వీళ్లు నిజంగానే పెళ్లి చేసుకున్నారని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా రెడిన్‌ కింగ్‌స్లీ.. కోలమావు కోకిల అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించాడు.

ఈయన డైరెక్ట్‌ చేసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ రెడిన్‌ యాక్ట్‌ చేశాడు. డాక్టర్‌ మూవీలో ఈయన పోషించిన భగత్‌ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఎల్‌కేజీ, అన్నాత్తె, బీస్ట్‌, కాతువాకుల రెండు కాదల్‌, మార్క్‌ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్‌ వంటి పలు సినిమాలు చేశాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్‌ వంటి సినిమాలు చేసింది. ఎక్కువగా సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందింది.

చదవండి: క్యాసినో వల్ల డబ్బులు పోగొట్టుకున్నాం.. ఆ రోజు పోలీసులు..

Advertisement
 
Advertisement
 
Advertisement