కౌన్‌ హే అచ్చా... కౌన్‌ హే లుచ్చా.. అదిరిపోయింది | Red Movie Happy To Huge Response For Kaun Acha Kaun Lucha Song | Sakshi
Sakshi News home page

థీమ్‌ అదిరింది

Dec 16 2020 8:33 AM | Updated on Dec 16 2020 10:24 AM

Red Movie Happy To Huge Response For Kaun Acha Kaun Lucha Song - Sakshi

రామ్, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరో హీరో యిన్లుగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మించిన చిత్రం ‘రెడ్‌’. ఈ సినిమాలోని ‘కౌన్‌ హే అచ్చా... కౌన్‌ హే లుచ్చా...’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేశారు. కిశోర్‌ తిరుమల మాట్లాడుతూ – ‘‘సినిమాలో హీరో కేరక్టర్‌ ఎలివేషన్‌ నేపథ్యంలో వచ్చే పాట ఇది. కల్యాణ్‌ చక్రవర్తి పర్ఫెక్ట్‌గా రాశారు. ‘థీమ్‌ అదిరింది’ అని దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఈ పాట గురించి ట్విట్టర్‌లో ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. మణిశర్మగారి బాణీకి అనురాగ్‌ కులకర్ణి గానం అదనపు ఆకర్షణ అయింది’’ అన్నారు. రవికిశోర్‌ మాట్లాడుతూ– ‘‘రెడ్‌’ నుంచి ఏ పాట విడుదలైనా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మణిశర్మగారి స్వరాలకు ఎంత గొప్ప ఆదరణ ఉంటుందో మరోసారి నిరూపితం అయింది. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement