ఆ రోజు గోల గోల చేద్దాం | Raviteja Eagle Movie Second Song Released | Sakshi
Sakshi News home page

ఆ రోజు గోల గోల చేద్దాం

Dec 28 2023 5:40 AM | Updated on Dec 28 2023 5:40 AM

Raviteja Eagle Movie Second Song Released - Sakshi

‘‘మీ అందరి (అభిమానులు) ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉంది. ‘ఈగల్‌’ వైవిధ్యమైన మాసీ ఫిలిం. వినోదం అద్భుతంగా ఉంటుంది. నాకు విపరీతంగా నచ్చింది.. మీ అందరికీ తెగ నచ్చుతుంది. జనవరి 13న అందరూ థియేటర్స్‌కి వచ్చేయండి.. గోల గోల చేద్దాం’’ అన్నారు హీరో రవితేజ. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ, కావ్యా థాపర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఈగల్‌’.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా జనవరి 13న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. దేవ్‌ జాంద్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గల్లంతే..’ అంటూ సాగే రెండో పాటని సెయింట్‌ మార్టిన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్‌ సాహిత్యం అందించగా, కపిల్‌ కపిలన్, లిన్‌ పాడారు.

కావ్యా థాపర్‌ మాట్లాడుతూ – ‘‘గల్లంతే..’ పాట నాకు చాలా ప్రత్యేకం. రవితేజగారితో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘రవితేజగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన సినిమాకి సంగీతం ఇవ్వడంతో నా కల నెరవేరినట్టు అయింది’’ అన్నారు దేవ్‌ జాంద్‌. ఈ వేడుకలో కార్తీక్‌ ఘట్టమనేని, టీజీ విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్‌ కూఛిబొట్ల, నటుడు నవదీప్‌ తదితరులు పాల్గొన్నారు.  

కోటికి రవితేజ వాయిస్‌  
తేజ సజ్జా, అమృతా అయ్యర్‌ జంటగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను–మాన్‌’. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలవుతోంది. ఈ సినిమాలో కోటి పాత్రలో నటించిన వానరానికి హీరో రవితేజ డబ్బింగ్‌ చె΄్పారు. ‘‘రవితేజగారి వాయిస్‌తో కోటి పాత్ర మరింత హ్యూమరస్, ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అని మేకర్స్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement