Raveena Tandon: అందుకే దక్షిణాది సినిమాలు హిట్‌ అవుతున్నాయి

Raveena Tandon Compares Bollywood And South India Movies - Sakshi

Raveena Tandon Compares Bollywood And South India Movies: బాలీవుడ్‌ ఇండస్ట్రీపై నటి రవీనా టండన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఇటీవల విడుదలైన కేజీఎఫ్‌ 2లో ఆమె కీ రోల్‌ పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటనకు, పాత్రకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఇక మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో రవీనా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకున్నారు. అయితే ప్రస్తుతం దక్షిణాది సినిమాలు ఉత్తరాదిలోనూ అత్యంత ఆదరణ పొందుతున్నాయి. అక్కడ మన సౌత్‌ సినిమాల రేంజ్‌ వంద కోట్ల బడ్జెట్‌కు చేరింది.

చదవండి: OTT: దక్షిణాది భాషల్లోకి ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’, స్ట్రీమింగ్‌ ఎప్పుడు.. ఎక్కడంటే

అంతేకాదు మన సినిమాలను సైతం బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్‌, బాలీవుడ్‌ ఇండస్ట్రీల మధ్య తేడా గురించి తాజాగా రవీనా ప్రస్తావించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. దక్షిణాది చిత్రాలు ఇండియన్‌ కల్చర్‌కు దగ్గరగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే.. బాలీవుడ్‌ సినిమాలు మాత్రం హాలీవుడ్‌ను ఫాలో అవుతూ మాస్‌ ఆడియన్స్‌కు దూరమవుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ‘90లలో పాశ్చాత్య దేశాల సంస్కృతికి దగ్గరగా ఉండేలా మెలోడియస్, మ్యూజికల్ చిత్రాలు వచ్చాయి. అవి హాలీవుడ్ సినిమాలకు దగ్గరగా ఉండేవి. దీంతో బాలీవుడ్ సినిమాల్లో ఇండియన్ కల్చర్ తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో నేను కొన్ని దక్షిణాది చిత్రాల్లో నటించాను.

చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌!

అక్కడ వాళ్లు మన సంస్కృతి, సంప్రదాయాలకు దగ్గరగా ఉండే సినిమాలు తీశారు. దీంతో ప్రేక్షకులు వాటిలో తమను తాము చూసుకుంటూ మన సంస్కృతికి దగ్గరయ్యారు. అలా ఆ సినిమాలని ప్రేక్షకులు సూపర్‌హిట్ చేశారు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో అలాంటి చిత్రాలు తగ్గడంతో మాస్ ఆడియన్స్‌ హిందీ సినిమాలకు దూరమయ్యారు’ అని రవీనా టండన్ చెప్పుకొచ్చారు. కాగా ఏప్రీల్‌ 14న విడుదలైన  ‘కేజీఎఫ్: చాప్టర్-2’ దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో సునామీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ మూవీ 625 కోట్ల రూపాయలను వసూలు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఒక్క 5వ రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.73.29 కోట్లను వసూళ్లు చేయడం గమనార్హం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top