బాలీవుడ్‌‌ మరో చిత్రానికి ‘గుడ్‌ బై’ చెప్పిన రష్మిక! | Rashmika Mandanna Joins In Her 2nd Hindi Movie Good Bye Shooting | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌‌ మరో చిత్రానికి ‘గుడ్‌ బై’ చెప్పిన రష్మిక!

Apr 1 2021 7:52 AM | Updated on Apr 1 2021 7:52 AM

Rashmika Mandanna Joins In Her 2nd Hindi Movie Good Bye Shooting - Sakshi

‘డెడ్లీ’కి ‘గుడ్‌ బై’ చెప్పారు హీరోయిన్‌ రష్మికా మందన్నా. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు వికాస్‌ బాల్‌ దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్, రష్మికా మందన్నా ప్రధాన పాత్రధారులుగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘కళంక్‌’, ‘థప్పడ్‌’ చిత్రాల్లో నటించిన పావెల్‌ గులాటి ఈ సినిమాలో భాగమయ్యారు. ఇందులో పావెల్‌కు జోడీగా రష్మిక కనిపిస్తారని టాక్‌. ఈ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ మొదటివారంలో ప్రారంభం కానుంది.

మొదటి షెడ్యూల్‌లోనే అమితాబ్, రష్మికా, పావెల్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేలా చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేసిందని బాలీవుడ్‌ సమాచారం. ఇంకో విషయం ఏంటంటే.. ఈ సినిమాకు ముందుగా ‘డెడ్లీ’ అనే టైటిల్‌ అనుకున్నారు. కానీ ఇప్పుడు ‘గుడ్‌ బై’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేయాలని ఆలోచిస్తున్నారని బాలీవుడ్‌ సమాచారం. హిందీలో రష్మిక నటిస్తున్న రెండో చిత్రం ఇది. సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘మిషన్‌ మజ్ను’ హీరోయిన్‌గా రష్మికకు హిందీలో తొలి చిత్రం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement