రామ్‌ చరణ్‌కు గాయం.. షూటింగ్‌కు బ్రేక్‌ | Ram Charan Injured In Peddi Movie Shooting | Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌కు గాయం.. షూటింగ్‌కు బ్రేక్‌

Mar 25 2026 7:41 AM | Updated on Mar 25 2026 10:31 AM

Ram Charan Injured In Peddi Movie Shooting

రామ్‌ చరణ్‌  గాయపడ్డారని సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా సెట్స్‌లో చరణ్‌కు స్వల్ప గాయం అయినట్లు సమాచారం.  ఆయన కంటి దగ్గర గాయమైనట్లు తెలుస్తోంది. కానీ, అది స్వల్పమైనదేనని చెబుతున్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోషల్‌మీడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్నారు. రామ్ చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని, తిరిగి సెట్స్‌లో చేరతారని అంటున్నారు. ప్రస్తుతం  హైదరాబాద్‌లోనే చరణ్‌తో ఉన్న కీలక సన్నివేశాలను మేకర్స్‌ చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఒక ప్రత్యేక గీతాన్ని షూట్‌ చేయనున్నారట. రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) శుక్రవారం కావడంతో, ఆ రోజున ఒక టీజర్‌ను విడుదల చేస్తారని టాక్‌..

గ్రామీణ నేపథ్యంలో జరిగే   స్పోర్ట్స్‌ డ్రామా మూవీగా ‘పెద్ది’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌, బాలీవుడ్‌ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 27న బాక్సాఫీసు ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 30న విడుదల  చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. అయితే, ఈ తేదీలో కూడా పెద్ది విడుదల కావడం కష్టమేనని వార్తలు వస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement