లవ్ యు చరణ్ అన్నా అంటూ సూసైడ్‌ లేఖలో ఏం రాశాడంటే..

Ram Charan Fan Warning To Game Changer Team - Sakshi

గ్లోబల్​ స్టార్​ రామ్ చరణ్ - కోలీవుడ్ దిగ్గజ​ దర్శకుడు శంకర్​ కాంబోలో రూపొందుతున్న భారీ బడ్జెట్​ సినిమా 'గేమ్ ఛేంజర్'​కు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ చిత్రం ఎన్నో సార్లు వాయిదా వేసుకుంటూ షూటింగ్​ జరుపుకుంటోంది.ఈ చిత్రం​ ప్రకటించి ఇప్పటికే ఏళ్లు గడుస్తున్నప్పటికీ కనీసం ఒక్క సరైన అప్డేట్ కూడా రాలేదు. దీంతో చాలా కాలంగా ఎదురు చూస్తున్న రామ్​ చరణ్​ అభిమానులు తీవ్రంగా నిరాశ పడుతున్నారు. దీనంతటికి ప్రధాన కారణం దర్శకుడు శంకర్ అనే చెప్పవచ్చు. దిల్‌ రాజు గేమ్‌  ఛేంజర్‌ ప్రకటించిన వెంటనే శంకర్‌ కూడా షూటింగ్‌ ప్రారంభించాడు.

కానీ ఈ సినిమా సెట్స్‌పైన ఉండగా మధ్యలో కమల్​ హాసన్ 'ఇండియన్​ 2'ను తీసుకొచ్చి చిత్రీకరణ ప్రారంభించారు. దీంతో 'గేమ్​ ఛేంజర్' ఆలస్యం అవుతూ.. బడ్జెట్​ పెరిగిపోతూ వెళ్తోంది. ఇప్పటికీ 50 శాతం కూడా పూర్తి అవలేదని సమాచారం. తాజాగా ఈ సినిమా షూట్‌ షెడ్యూల్‌ను రెండు నెలలుపాటు వాయిదా వేశారని సమాచారం. దీంతో రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చి సోషల్‌ మీడియా ద్వారా దిల్‌రాజు,డైరెక్టర్‌ శంకర్‌ పట్ల కొంతమేరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'గేమ్‌ ఛేంజర్‌' ఆలస్యం అవుతుండటంతో చరణ్‌ అభిమాని సూసైడ్‌ లేఖ రాశాడు. మరో మూడు రోజుల్లో గేమ్‌ ఛేంజర్‌ విడుదల తేదీ ఎప్పుడో చెప్పకపోతే సూసైడ్‌ చేసు​కుంటానని అల్టిమేటం జారీ చేశాడు. దీనికి కారణం దిల్‌ రాజు,డైరెక్టర్‌ శంకర్‌ పేర్లు రాశాడు.

సూసైడ్ నోట్ లో ఏం రాశాడండే
'నేను సూసైడ్‌ చేసుకునేంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నానంటే... రామ్‌చరణ్ వీరాభిమానిగా గేమ్‌ ఛేంజర్‌ కోసం దాదాపు రెండేళ్లుగా ఎదరుచూస్తున్న. కనీసం రిలీజ్ డేట్ కోసం ఎంతో ఓపికగా ఎదురుచూశాను. దురదృష్టవశాత్తు, ప్రొడక్షన్ టీమ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌లు లేవు. సినిమా షూటింగ్‌ మాత్రం పలుమార్లు వాయిదా పడుతూనే ఉంది. సినిమా విడుదల తేదీ ఎప్పుడనేది మరో మూడు రోజుల్లో ప్రకటించాలి. లేదంటే, నా జీవితాన్ని ముగించేస్తాను. అదే జరిగితే నా చావుకు ప్రధాన కారకులు డైరెక్టర్‌ శంకర్ షణ్ముగం, దిల్ రాజు, SVC ప్రొడక్షన్స్‌ వారే కారణం. కాబట్టి దయచేసి మీరు, నా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

లవ్ యు చరణ్ అన్నా.., నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నా తదుపరి జీవితంలో నేను మీకు మంచి అభిమానిగా ఉంటానని ఆశిస్తున్నాను, ఇట్లు బాబు గౌడ్.' అనే పేరుతో సూసైడ్‌ లేఖ రాశాడు. ఈ లేఖను చిత్ర నిర్మాతలకు చేరవేశాడో లేదో తెలియరాలేదు కానీ సోషల్‌ మీడియాలో మాత్రం విపరీతంగా ట్రెండ్‌ అవుతుంది. ఒక సినిమా కోసం ఇలాంటి పనులు చేయడం సబబు కాదని పలువురు కోరుతున్నారు. కొన్నిసార్లు ఇలాంటివి సరదా కోసం చేసినా వాటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పలువరు గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా వైరల్‌ అవుతున్న ఈ లేఖ ద్వారా అయినా గేమ్‌ ఛేంజర్‌లో మార్పు వస్తుందని ఆశిద్దాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top