మహేశ్‌ బాబు, రాజమౌళి సినిమాకు బ్యూటిఫుల్‌ హీరోయిన్‌..! | Rajamouli And Mahesh Babu Movie Casted Indonesian Heroine Chelsea Elizabeth Islan - Sakshi
Sakshi News home page

మహేశ్‌ బాబు, రాజమౌళి సినిమాకు బ్యూటిఫుల్‌ హీరోయిన్‌..!

Published Sun, Jan 7 2024 4:11 PM

Rajamouli And Mahesh Babu Movie Casted Indonesian Heroine Elizabeth Chelsea - Sakshi

టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా గురించి రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా బడ్జెట్‌ రూ. 1500 కోట్లు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్‌కు తెలుగు సినిమాను పరిచయం చేయాలని రాజమౌళి ఉన్నారని సమాచారం. దీంతో వీరిద్దరి కాంబోలో రానున్న చిత్రంలో మహేశ్‌ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి ఎంపికైనట్లు సమాచారం.

హాలీవుడ్ సినిమాల్లో నటిస్తోన్న ఇండోనేషియా నటి ఎలిజబెత్ చెల్సియా ఇస్లాన్‌ను తీసుకుంటున్నట్లు సమాచారం. కానీ అధికారికంగా చిత్ర యూనిట్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు.‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత జక్కన్న  హాలీవుడ్‌ రేంజ్‌లో సినిమా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాడట. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి అయింది. హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా ఈ సినిమాలో పనిచేసే అవకాశం ఉంది. 

ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌తో పాటు లొకేషన్ స్కౌటింగ్,షెడ్యూల్ ప్లానింగ్ జరుగుతోంది. వీటన్నింటితో పాటు ఈ సినిమాలో నటించే స్టార్‌కాస్ట్‌ని ఫైనల్ చేసే ప్రయత్నంలో జక్కన్న ఉన్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇది 29వ సినిమా. కాబట్టి ఈ ప్రస్తుతానికి SSMB29 అని పిలుస్తున్నారు. ఇండోనేషియాలో జన్మించిన నటి చెల్సీ ఇస్లాన్ SSMB29 కోసం మహిళా ప్రధాన పాత్రలో ఎంపికైంది. దీనిపై చర్చ జరగడంతో పాటు జక్కన్న లుక్ టెస్ట్ కూడా చేయించాడని టాలీవుడ్‌లో గుసగుసలు మొదలయ్యాయి.

కాగా, ఈ చిత్రాన్ని కె. ఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందించగా పి. ఎస్.వినోద్ ఛాయాగ్రహణం ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో జేమ్స్ బాండ్ స్టైల్ యాక్షన్ అడ్వెంచర్స్‌ సీన్స్‌లలో మహేష్ బాబు కనిపించనున్నాడు.

Advertisement
 
Advertisement