Sagarika: మీరు చూస్తారు కాబట్టే అశ్లీల చిత్రాలు తీస్తామని దబాయింపు

Raj Kundra Case: Model Sagarika Sona Gets Abusive And Life Threat Calls - Sakshi

Sagarika Shona Suman: ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాపై ఆరోపణలు చేసిన మోడల్‌, నటి సాగరిక ఇబ్బందుల్లో పడింది. తనను అత్యాచారం చేసి, చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని వాపోయింది. ఈ మేరకు గురువారం నాడు ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "కొందరు వ్యక్తులు నాకు ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు. అత్యాచారం చేసి చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అసలు రాజ్‌ కుంద్రా ఏం తప్పు చేశాడని ప్రశ్నిస్తున్నారు. మీరు పోర్న్‌ చిత్రాలు చూస్తారు కాబట్టే మేము వాటిని చిత్రీకరిస్తున్నామని దబాయించారు. ఈ చీకటి వ్యాపారానికి ముగింపు పడటానికి కారణం నేనేనని నిందిస్తున్నారు. వేర్వేరు నంబర్ల నుంచి ఈ ఫోన్లు వస్తూనే ఉన్నాయి.

ఇదంతా నాకు చాలా ఇబ్బందిగా అనిపించడమే కాక నా జీవితం ప్రమాదంలో పడినట్లు అనిపిస్తోంది. దీనికి కారణమైనవారిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను" అని చెప్పుకొచ్చింది. కాగా రాజ్‌ కుంద్రా దగ్గర పనిచేసే ఉమేశ్‌ కావత్‌ నుంచి తనకు వెబ్‌ సిరీస్‌ కోసం పిలుపు వచ్చిందంటూ సాగరిక ఇంటర్వ్యూ ఒకటి వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే వీడియో కాల్‌ ద్వారా ఆడిషన్‌ ఉంటుందని, ఈ వీడియోకాల్‌లో నగ్నంగా కనిపించాలని చెప్పడంతో దాన్ని తిరస్కరించానని చెప్పింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top