ఫ్యామిలీమ్యాన్‌ 3 కోసం కొత్తగా.. : రాజ్‌ అండ్‌ డీకే

Raj And DK Opens Up About Samantha Colour Controversy - Sakshi

రాజ్‌ అండ్‌ డీకే.. ఫ్యామిలీమ్యాన్‌ 2 సక్సెస్‌తో ఈ దర్శక ద్వయం క్రేజ్‌ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. హిందీలో వరుసగా సూపర్‌ హిట్‌ కథల్ని అందిస్తున్న ఈ తెలుగువాళ్లు.. బాలీవుడ్‌లో కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతూ జెట్‌ స్పీడ్‌తో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఓ మీడియాహౌజ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు. 

ప్రస్తుతం అమెజాన్‌ వెబ్‌ సిరీస్‌ ‘ఫ్యామిలీమ్యాన్‌ 3’ కోసం కథ సిద్ధం చేస్తున్న రాజ్‌ అండ్‌ డీకే.. ఇందుకోసం వ్యూయర్స్‌ దగ్గరి నుంచే ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలనే అనుకుంటున్నారట. తద్వారా లోటు పాట్లను పూడ్చుకోవచ్చనే ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. ‘ఫ్యామిలీమ్యాన్‌ 2లో వర్కవుట్‌ కానీ విషయాల్లో.. సమంతను తెరపై చూపించిన విధానం ఒకటి. ఆమె ముఖం రంగును అలా చూపించడంపై  చాలామంది విమర్శించారు. కానీ, ఇది ముందే ఊహించగలిగాం. తెల్లగా ఉండే ఒక నటి, నలుపు రంగు క్యారెక్టర్‌​ చేసినప్పుడు.. రేసిజం విమర్శలు రావడం సహజమే. ఇది మాకూ తెలుసు. కానీ, ఒక ప్రయోగం విఫలమైనప్పుడు.. ఎందుకు వర్కవుట్‌ కాలేదు.. ఎక్కడ తప్పు జరిగిందో అని గుచ్చిగుచ్చి వెతుకుతారు. ఒకవేళ అది సక్సెస్‌ అయినా.. ఊరుకోరు’ అని డీకే(కృష్ణ డీకే) తెలిపాడు. (ఫ్యామిలీమ్యాన్‌ 2 రివ్యూ)

ఫ్యామిలీమ్యాన్‌ విషయంలో మాకో కాన్సెప్ట్‌ ఉంది. ఐడియా ఉంది. కానీ, దానిని ఇంకా డెవలప్‌ చేయాల్సి ఉంది. అందుకోసమే జనాల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని అనుకుంటున్నాం. ఆ ఫీడ్‌బ్యాక్‌పై ఓ కూర్పునకు వచ్చాక కథను డెవలప్‌ చేస్తాం’ రాజ్‌ (రాజ్‌ నిడిమోరు) తెలిపాడు. ఇక సీజన్‌ 2 ముగింపులో చైనా-వైరస్‌ ట్విస్ట్‌తో.. తర్వాతి సీజన్‌ హింట్‌ ఇచ్చారని వ్యూయర్స్‌ అనుకున్నారు. అయితే మనోజ్‌ వాజ్‌పాయి లీడ్‌ రోల్‌లో సీజన్‌ 3కి ఇంకా రెండేళ్లు టైం పట్టొచ్చని, ఈ లోపు రాజ్‌ అండ్‌ డీకేలు షాహిద్‌ కపూర్‌తో ఓ సిరీస్‌ ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

చదవండి: ఫ్యామిలీమ్యాన్‌ కోసం ఎవరెంత రెమ్యునరేషన్‌ అంటే..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top