Raiza Wilson shares crying photos on Instagram, leaves her fans shocked - Sakshi
Sakshi News home page

Raiza Wilson: ఏడ్చిన ఫోటోలు షేర్‌ చేసిన నటి, కలవరపడుతున్న ఫ్యాన్స్‌

May 20 2023 1:15 PM | Updated on May 20 2023 2:05 PM

Raiza Wilson Shares Crying Photos - Sakshi

ఇదంత సులువు కాదు. నువ్వు ఒంటరివి కాదు. మనం కలిసి దీన్ని పరిష్కరించుకుందాం' అని క్యాప్షన్‌ జోడించింది. ఇది చూసిన అభిమానులు రైజాకు ఏమైందని కలవరపడు

మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన రైజా విల్సన్‌ 'ప్యార్‌ ప్రేమ కాదల్‌' చిత్రంతో హీరోయిన్‌గా మారింది. బిగ్‌బాస్‌ రియాలిటీ షో ద్వారా మరింత పాపులర్‌ అయింది. ఆ మధ్య ఫేషియల్‌ కోసం వెళ్తే మరేదో చికిత్స చేసి తనను అందవిహీనంగా మార్చారంటూ ఫోటోలు కూడా షేర్‌ చేసింది. డాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల తన ముఖం మీద మార్పులు వచ్చాయని, ఫలితంగా సినిమాల్లోనూ నటించలేకపోయానని చెప్పింది. తనకు జరిగిన నష్టానికిగానూ కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అప్పట్లో ఈ సమస్య హాట్‌టాపిక్‌గా నిలిచింది.

తాజాగా మరోసారి రైజా వార్తల్లో నిలిచింది. గురువారం రాత్రి నటి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఏడుస్తున్న ఫోటోలను షేర్‌ చేసింది. 'ఇదంత సులువు కాదు. నువ్వు ఒంటరివి కాదు. మనం కలిసి దీన్ని పరిష్కరించుకుందాం' అని క్యాప్షన్‌ జోడించింది. ఇది చూసిన అభిమానులు రైజాకు ఏమైందని కలవరపడుతున్నారు. 'నీకు ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ ధైర్యంగా ఉండు..', 'బాధలు, కష్టాలు ఎల్లప్పుడూ మనతోనే ఉండవు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

దీనిపై రైజా స్పందిస్తూ.. 'నా బాగోగులు తెలుసుకునేందుకు సమయం కేటాయించి మరీ మెసేజ్‌ చేస్తున్న వారికి, మంచిమాటలు చెప్పి ఓదార్చినవారికి, నాలో ధైర్యాన్ని నింపినవారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మానవత్వం, కరుణ, దయ అనే పదాలకు ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయలేం. థాంక్యూ సో మచ్‌' అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది. కాగా రైజా విల్సన్‌ ఎఫ్‌ఐఆర్‌, కాఫీ విత్‌ కాదల్‌ వంటి చిత్రాల్లోనూ నటించింది.

చదవండి: సైడ్‌ అయిన బాలీవుడ్‌ బ్యూటీ, కీర్తి సురేశ్‌ ఎంట్రీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement