ఆసక్తికరంగా 'రహస్య' టీజర్

Rahasya Movie Teaser Out - Sakshi

ప్రస్తుతం కొత్త కథలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రొటీన్ చిత్రాలకంటే కొత్తగా ఉన్నా సినిమాలనే జనాలు ఇష్టపడుతున్నారు. థియేటర్లో వచ్చి చూసేంత కంటెంట్ ఉంటేనే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే మిస్టరీ థ్రిల్లింగ్ సినిమాల పట్ల ఆసక్తి చూపుతున్నారు నేటితరం ఆడియన్స్. దర్శకనిర్మాతలు సైతం అదే కోణంలో సినిమాలు రూపొందిస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ఇదే బాటలో ఇప్పుడు రహస్య అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రూపుదిద్దుకుంటోంది.  నివాస్ శిష్టు,  సారా ఆచార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి  శివ శ్రీ మీగడ దర్శకత్వం వహిస్తుండగా.. గౌతమి.ఎస్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

(చదవండి: సమంత ఎక్కడ? ఆమె సైలెన్స్‌కు కారణం ఇదేనా?)

తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. 52 సెకన్ల నిడివితో కట్‌ చేసిన ఈ టీజర్‌..  సినిమా పట్ల ఆసక్తి రేకెత్తిస్తోంది. క్రైం మిస్టరీ నేపథ్యంలో మిస్టరీ కథాంశంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఈ వీడియో స్పష్టం చేస్తోంది. అంతుచిక్కని ఓ క్రైం ఇన్సిడెంట్‌ని పోలీసు వర్గాలు ఎలా ఛేదించాయి? ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు ఎలాంటివి? అనే పాయింట్ తో రియలిస్టిక్‌గా ఈ రహస్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని అర్థమవుతోంది. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ కోణాలను టచ్ చేస్తూ సస్పెన్స్ మిస్టరీకి తెర రూపమిచ్చారని తెలుస్తోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top