Allu Arjun Pushpa 2 Movie Latest Shooting Video Leaked, Goes Viral - Sakshi
Sakshi News home page

Pushpa 2 Shoot Video: 'పుష్ప 2'లో లారీ ఫైట్.. ఏకంగా అలాంటి చోట!

Jun 16 2023 2:56 PM | Updated on Jun 16 2023 3:36 PM

Pushpa 2 Latest Shooting Video Viral - Sakshi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. 'పుష్ప' మూవీతో ఐకాన్ స్టార్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా యమ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్ జోరుగా సాగుతోంది.  ఇప్పుడు అందులో నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

'బాహుబలి' తీసిన రాజమౌళి.. తెలుగు సినిమా రేంజుని పెంచారు. ఆ తర్వాత 'పుష్ప' తెలుగోడి అసలు సిసలు మాస్ చూపించింది. నార్త్ ఆడియెన్స్ అయితే ఈ మూవీ చూసి మెంటలెక్కిపోయారు. పార్ట్ 2 ఎప్పుడొస్తుందా అని తెగ వెయిట్ చేస్తున్నారు. మరోవైపు మేకర్స్.. సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఇప్పుడు అలా ఓ వీడియో లీకైంది. అది ఫ్యాన్స్ కి ఫుల్ గూస్ బంప్స్ ఇస్తోంది.

ఈ వీడియోలో భాగంగా ఓ నదిలో ఎర్రచందనం దుంగలతో ఉన్న లారీల మధ్య ఛేజ్ జరుగుతోంది. జీపుల్లో కెమెరాలు పెట్టి షూట్ చేస్తున్నారు. ఇది చూస్తుంటే ఇంటర్వెల్ ఫైట్ లా అనిపిస్తుంది. జస్ట్ విజువల్ గా చూస్తే ఏమనిపించకపోవచ్చు గానీ సరైన బ్యాక్ గ్రౌండ్ స్కోరు పడితే మాత్రం థియేటర్ల పునకాలు వచ్చే ఛాన్సుంది. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ మూవీ వచ్చే వేసవికి రిలీజయ్యే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. 

(ఇదీ చదవండి: Jee Karda Review: 'జీ కర్దా' వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement