ఆస్తులు అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా.. కారణం ఇదేనా? | Priyanka Chopra Offloads Sells Her Mumbai Apartment Worth RS 6 Crore | Sakshi
Sakshi News home page

Priyanka Chopra: ఆస్తులు అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా.. కారణం ఇదేనా?

Nov 18 2023 3:19 PM | Updated on Nov 18 2023 3:39 PM

Priyanka Chopra Offloads Sells Her Mumbai Apartment Worth RS 6 Crore - Sakshi

ఒకప్పుడు వరుస సినిమాలతో బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన ప్రియాంక చోప్రా.. పెళ్లి తర్వాత ఇప్పుడు హాలీవుడ్‌లో బిజీ అయింది. 2018లో హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌తో పెళ్లి జరిగిన తర్వాత ప్రియాంక తన మకాంను లాస్‌ ఏంజిల్స్‌కి మార్చింది. ప్రస్తుతం అక్కడే భర్త నిక్‌, కూతురు మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌తో కలిసి ఉంటోంది. అయితే ఎప్పుటికైనా తిరిగి ఇండియాకు వస్తుందని భావించారు ఆమె ఫ్యాన్స్‌. కానీ ఆమె మాత్రం భారత్‌తో సంబంధాలు తెచ్చుకొని.. లాస్‌ ఏంజిల్స్‌లోనే శాశ్వతంగా నివాసం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇండియాలోని తన  తన ఆస్తులన్నింటిని వరుసబెట్టి అమ్ముతోంది. ఆ మధ్య​ లోఖండ్‌వాలాలోని ఒక కమర్షియల్ ప్రాపర్టీని రూ. 7 కోట్లకు అమ్మేసింది. తాజాగా ముంబైలోని  అంధేరి శివారులో ఉన్న అపార్ట్‌మెంట్‌ను కూడా అమ్మకానికి పెట్టేసినట్లు తెలుస్తోంది. 

భారీ ధరకు కొనుగోలు చేసిన డైరెక్టర్‌
ప్రియాంక చోప్రాకు చెందిన అపార్ట్‌మెంట్‌ని బాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత అభిషేక్‌ చౌబే భారీ ధరకు కొనుగోలు చేశారట. అంధేరీ శివారులో ఉన్న రెండు అపార్ట్‌మెంట్‌ పెంట్‌హౌస్‌లను దాదాపు రూ. 6 కోట్లు చెల్లించారట. ఈ విక్రయాలకు సబంధించిన పనులను  ప్రియాంక తల్లి మధు చోప్రా  చూసుకున్నారట. ఈ ఏడాది అక్టోబర్ 23, 25 తేదీల్లో వీటికి సంబందించిన లావాదేవీలు జరిగినట్టు సమాచారం. అయితే వీటికి సబంధించి  మొత్తం స్టాంప్ డ్యూటీ ఛార్జీలుగా 36 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. 

భారత్‌కు దూరమేనా?
బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన తర్వాత హాలీవుడ్‌కి చెక్కేసింది ప్రియాంక్‌. అక్కడే నిక్‌ జోనస్‌తో ప్రేమలో పడి..పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లుగా లాస్‌ ఏంజిల్స్‌లోనే నివాసం ఉంటోంది. అయితే ఎప్పటికైనా తిరిగి ముంబై వస్తారని ఆమె అభిమానులు ఆశించారు. కానీ ప్రియాంక ఇక్కడి ఆస్తులను వరుసబెట్టి అమ్మకానికి పెడుతోంది. దీన్ని బట్టి చూస్తే... ప్రియాంక  ఇండియాతో సంబంధాలు తెచ్చుకుని.. అక్కడే ఫిక్స్ అయిపోయేలా ఉంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా.. హెడ్స్ ఆఫ్ స్టేట్ తో పాటు పలు వెబ్‌సీరీస్‌ల్లోనూ  నటిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement