అమాయకుడా? నేరస్థుడా? | Prithviraj Sukumaran Nobody to release in Telugu on July 10 | Sakshi
Sakshi News home page

అమాయకుడా? నేరస్థుడా?

Jul 5 2026 3:59 AM | Updated on Jul 5 2026 3:59 AM

Prithviraj Sukumaran Nobody to release in Telugu on July 10

సాధారణ బ్యాంకు ఉద్యోగి రాజు భారీ బ్యాంకు దోపిడీకి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటాడు. అతను తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అనుకోకుండా హింసాత్మక మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. అసలు రాజు నేరస్థుడేనా? లేక పరిస్థితుల బారిన పడిన అమాయకుడా? అనే కథాంశంతో రూ పొందిన మలయాళ చిత్రం ‘ఐ, నోబడీ’. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి నిస్సాం బషీర్‌ దర్శకత్వం వహించారు.

పార్వతి తిరువోతు మరో లీడ్‌ రోల్‌లో నటించారు. ఈ నెల 9న మలయాళంలోనూ, 10న తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది. శ్రీ స్రవంతి మూవీస్, మైత్రీ మూవీస్‌ ఈ చిత్రాన్ని తెలుగులో ఇదే టైటిల్‌తో విడుదల చేయనున్నాయి.

‘‘ఉత్కంఠభరితమైన కథ, స్క్రీన్‌ప్లే, సస్పెన్స్, యాక్షన్‌ సన్నివేశాలతో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా ఉంటుంది. పృథ్వీరాజ్‌కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ ‘ఐ, నో బడీ’కి మంచి క్రేజ్‌ ఉండడంతో ఈ నెల 9న పెయిడ్‌ ప్రీమియర్స్‌ ప్లాన్‌ చేస్తున్నాం’’ అని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాణ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement