
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’ జనవరి 14న రిలీజ్ అవుతుందా లేదా అనుమానాలకు చిత్ర యూనిట్ చెక్ పెట్టింది. అంతా ఊహించినట్లే సినిమా విడుదలను వాయిదా వేసింది. మరోవైపు ‘రాధేశ్యామ్’విడుదల వాయిదా పడిందని, నేరుగా ఓటీటీ ద్వారా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ మాత్రం ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. 2022లో ప్రభాస్ సినిమాలు ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేయనున్నాయి.ప్రతీ సినిమాలోనూ ప్రభాస్ క్యారెక్టర్ కొత్తగా కనిపించనుంది.ప్రతీ పాత్ర పవర్ ఫుల్ గా ఉండనుంది.
రాధేశ్యామ్ లో ప్రేమికుడి పాత్రలో నటిస్తున్నాడు రెబల్ స్టార్. రాధేశ్యామ్ తర్వాత ఆదిపురుష్ లో శ్రీరాముడి పాత్రలో అబ్బురపరచనున్నాడు.ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 2022లోనే ఈ మూవీని రిలీజ్ చేస్తామంటున్నారు దర్శకనిర్మాతలు.
ఆదిపురుష్ తర్వాత కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ లో మూవీ చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను ఇదే నెలలో ప్రారంభించబోతున్నారు. షూటింగ్ పూర్తి అయ్యే వరకు న్యూ షెడ్యూల్ కొనసాగనుంది.సలార్ లో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడట. మరోవైపు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగాతో మూవీని స్టార్ట్ చేయనున్నాడు ప్రభాస్. ఈ మూవీలో రెబల్ స్టార్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు. ప్యాన్ ఇండియా ఊరమాస్ మూవీ అంటే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించడబోతున్నాడట సందీప్ వంగా. మొత్తానికి ఈ ఏడాది ప్రభాస్.. ప్రేమికుడిగా, రాముడిగా, పోలీసు అధికారిగా పలు పాత్రల్లో ప్రేక్షకుడిని అలరించనున్నాడు.