Radhe Shyam Shooting In Gandikota, Pics Viral On Social Media - Sakshi
Sakshi News home page

Radhe Shyam Shooting: గండికోట‌లో ‘రాధేశ్యామ్‌’ షూటింగ్.. ఫోటోలు వైరల్‌

Aug 23 2021 1:45 PM | Updated on Aug 27 2021 11:57 AM

Prabhas Radhe Shyam Shooting In Gandi Kota Pics Goes Viral - Sakshi

యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా  సినిమాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్‌ బిజీగా ఉంది. పీరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు అంచనాలను పెంచాయనే చెప్పాలి. 

కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఇప్పటికే ప‌లుమార్లు వాయిదా ప‌డ్డ ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ‘రాధేశ్యామ్‌’ ప్ర‌స్తుత షెడ్యూల్‌ కడప జిల్లాలోని గండికోటలో షూటింగ్‌ జరుగుతోంది. ఇందులో వేద పాఠ‌శాల‌కు చెందిన గురువుగా స‌త్య‌రాజ్ నటిస్తున్నారు. ఆయ‌న‌తో పాటు కొంద‌రు అఘోరాల‌తో పాటు కీలక సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టంట హల్‌ చల్‌ చేస్తున్నాయి. గండికోటలో రాధేశ్యామ్ షూటింగ్ జరుగుతుందన్న సమాచారంతో ప్రభాస్ ఫ్యాన్స్ అక్కడికి భారీగా చేరుకుంటున్నారు షూటింగ్‌ను వీక్షిస్తున్నారు. ఈ చిత్రం యూర‌ప్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ప్రేమ‌క‌థ అని తెలుస్తోంది.1979 బ్యాక్ డ్రాప్ లోకి తీసుకెళ్లి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచ‌నున్నారట. ప్రస్తుతం ప్రభాస్..రాధేశ్యామ్‌తో పాటు సలార్, ఆదిపురుష్ సినిమాలు నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement