
Prabhas Radhe Shyam Is Release Directly On OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జనవరిలో విడుదలవుతుంది అనుకున్న రాధేశ్యామ్‌కు అనేకసార్లు బ్రేక్ పడింది. దీంతో ప్రేక్షకుల్లో, ప్రభాస్ హార్ట్‌కోర్ ఫ్యాన్స్‌లో తీవ్ర నిరాశ నెలకొంది. అయితే ఈ లవ్‌స్టోరీని థియేటర్లలో కాకుండా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకవచ్చే అవకాశం ఉందని ఇదివరకే పలుమార్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఖండించిన రాధేశ్యామ్ మేకర్స్ తమ ప్రాధాన్యం థియేటర్లే అని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రాధేశ్యామ్ రిలీజ్ ఎందులో అనే విషయంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి.
అయితే రాధేశ్యామ్ చిత్రాన్ని ఓటీటీలోనే రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్, జీ5 నుంచి ఈ సినిమాకు భారీ ఆఫర్ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఆఫర్ మేకర్స్‌కు కూడా నచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అన్నీ ఓకే అయితే ఈ రెండింటిలో ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో రాధేశ్యామ్ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉందన్న వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజగా ఈ వార్తలతో రాధేశ్యామ్ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తారా ? లేదా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారా ? అనే ఆసక్తి నెలకొంది.