సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ప్రభాస్‌ 25వ చిత్రం | Prabhas 25th Movie Turns Trending On Social Media | Sakshi
Sakshi News home page

#Prabhas25: అక్టోబర్‌ 7న బిగ్‌ అనౌన్స్‌మెంట్‌, ట్విటర్‌ ట్రెండింగ్‌లో టాప్‌ ప్లేస్‌

Oct 4 2021 9:31 PM | Updated on Oct 4 2021 11:52 PM

Prabhas 25th Movie Turns Trending On Social Media - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ చేతి నిండా ప్రస్తుతం భారీ బడ్జెట్‌ చిత్రాలు ఉన్నాయి. ‘సలార్‌, రాధేశ్యామ్‌, ఆది పురుష్‌’తో పాటు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘రాధే శ్యామ్‌ షూటింగ్‌ పూర్తి కాగా.. ‘సలార్‌’ చివరి షూటింగ్‌లు షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. మరోవైపు ఆది పురుష్‌ షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రభాస్‌ 25వ చిత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ అక్టోబర్‌ 7న రానున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఫ్యాన్స్‌  #ప్రభాస్‌ 25 (#Prabhas25) ట్యాగ్‌ను సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ చేస్తున్నారు. 

చదవండి: ‘గాడ్‌ ఫాదర్‌’లో తన రోల్‌ చెప్పెసిన గంగవ్వ, ఏకంగా చిరుకు..

అంతేగాక ఈ హ్యాష్‌ ట్యాగ్‌ ట్విటర్‌లో ఏకంగా టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్‌ ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్తగా కనిపించనున్నాడట. దీంతో రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటారు. అలాగే ప్రుభాస్‌ 25 చిత్రం ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్‌ 25వ చిత్రం దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రాబోతున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నారు. బాహుబలితో ప్రభాస్‌ను పాన్‌ ఇండియా స్టార్‌ చేసిన రాజమౌళియే ప్రభాస్‌ 25వ చిత్రాన్ని తెరకెక్కించడం నిజంగా విశేషం అంటూ ఫ్యాన్స్‌ అంతా మురిసిపోతున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజమందో తెలియాలంటే అక్టోబర్‌ 7వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement