ఇటలీకి హాయ్‌

Pooja Hegde in Italy to shoot for Radhe Shyam with Prabhas - Sakshi

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కోవిడ్‌ బ్రేక్‌ తర్వాత విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న భారీ తెలుగు చిత్రమిదే. 1970ల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఆల్రెడీ ప్రభాస్‌ అండ్‌ టీమ్‌ షూటింగ్‌ మొదలెట్టారు. తాజాగా పూజా హెగ్డే కూడా ఇటలీకి హాయ్‌ చెప్పారు. ఈ చిత్రం షూటింగ్‌లోకి ఎంటర్‌ అయ్యారు. ఈ సినిమాలో పూజా హెగ్డే ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్‌. ప్రభాస్, పూజా కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని దర్శకుడు ఇటీవలే పేర్కొన్నారు. భాగ్యశ్రీ, కృష్ణంరాజు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top