రిలీజ్‌ ముందు షాక్‌.. చిక్కుల్లో ఇండియన్‌-2! | A Person Files Complaint On Kamal Haasan's Indian 2 Movie | Sakshi
Sakshi News home page

Indian 2 Movie: రిలీజ్‌ ముందు షాక్‌.. చిక్కుల్లో ఇండియన్‌-2!

Published Wed, Jul 10 2024 3:54 PM | Last Updated on Wed, Jul 10 2024 4:19 PM

A Person Files Complaint On Kamal Haasan's Indian 2 Movie

శంకర్- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్‌-2. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ పూర్తి కాగా.. ప్రమోషన్లలో చిత్రబృందం బిజీగా ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న ఇండియన్‌-2 చిక్కుల్లో పడింది. తాజాగా ఈ సినిమా విడుదలను ఆపాలంటూ ఆసాన్‌ రాజేంద్రన్‌ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్‌ను ఈ చిత్రంలో వాడుకున్నారని మదురై జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సినిమాను రిలీజ్‌ కాకుండా నిషేధం విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వివరణ ఇవ్వాలంటూ చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది.  తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

కాగా.. ప్రాచీన యుద్ధకళల్లో ఒకటైన మర్మకళలో రాజేంద్రన్‌ ప్రసిద్ధుడు. ఆయన రాసిన పుస్తకం చదివిన డైరెక్టర్‌ శంకర్ గతంలో వచ్చిన భారతీయుడు చిత్రంలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. సేనాపతి పాత్ర కోసం నటుడు కమల్‌హాసన్‌కు రాజేంద్రన్‌ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అయితే తాజాగా సీక్వెల్‌గా వస్తోన్న ఇండియన్‌-2లో తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్‌ వాడారని రాజేంద్రన్‌ ఆరోపిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement