
‘మొగలి రేకులు’ సీరియల్ ఫేమ్ ఆర్‌కే సాగర్ హీరోగా నటించిన చిత్రం ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిషా నారంగ్ కథానాయికగా నటించగా, ధన్యా బాలకృష్ణ కీలకపాత్రపోషించారు. కేఆర్‌ఐఏ ఫిల్మ్ కార్ప్, దమ్మ ప్రోడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హీరో పవన్ కల్యాణ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
‘జీవితంలో జరిగిపోయినది మనం మార్చలేం... కానీ జరగబోయేదాన్ని కచ్చితంగా ఆపగలం’ అనే విక్రాంత్ ఐపీఎస్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్‌ప్రారంభమవుతుంది. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో విక్రాంత్ ఐపీఎస్‌గా ఆర్‌కే సాగర్ అద్భుతంగా నటించారు. మిషా నారంగ్‌పాత్ర కథకు రొమాంటిక్ టచ్‌ను యాడ్ చేస్తుంది’’ అని పేర్కొన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు.