నిఖిల్ 'కార్తికేయ'.. ముచ్చటగా మూడోసారి | Nikhil Siddhartha Drops Hint About Karthikeya 3 Says In Search Of A Brand New Adventure | Sakshi
Sakshi News home page

నిఖిల్ 'కార్తికేయ'.. ముచ్చటగా మూడోసారి

Mar 18 2024 3:58 AM | Updated on Mar 18 2024 8:12 AM

Nikhil Siddhartha Drops Hint About Karthikeya 3 Says In Search Of A Brand New Adventure - Sakshi

హీరో నిఖిల్‌ సిద్ధార్థ్, దర్శకుడు చందూ మొండేటిలది హిట్‌ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘కార్తికేయ’(2014) సూపర్‌ హిట్‌గా నిలిచింది. అలాగే వీరి కాంబోలో వచ్చిన ద్వితీయ సినిమా ‘కార్తికేయ 2’ (2022) పాన్‌ ఇండియా స్థాయిలో బ్లాక్‌ బస్టర్‌ అయింది. దీంతో ‘కార్తికేయ 3’ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. తాజాగా వారి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పడింది. నిఖిల్, చందూ కలయిక ముచ్చటగా మూడోసారి రిపీట్‌ అవుతోంది. ‘కార్తికేయ 3’ సినిమా రూపొందనున్నట్లు స్పష్టత ఇచ్చారు నిఖిల్‌.

‘‘దర్శకుడు చందూ మొండేటి అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ మూడవ ఫ్రాంచైజీకి (కార్తికేయ 3) సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌పై పని చేస్తున్నారు. ‘కార్తికేయ 3’ స్పాన్, స్కేల్‌ పరంగా చాలా పెద్దగా ఉండబోతోంది. డా.కార్తికేయ సరికొత్త సాహసం త్వరలోనే ప్రారంభం కానుంది’’ అన్నారు మేకర్స్‌. కాగా ప్రస్తుతం నిఖిల్‌ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. మరోవైపు నాగచైతన్య హీరోగా ‘తండేల్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు చందూ మొంటేటి. 

Advertisement
 
Advertisement
Advertisement