Trolls On Samantha For Not Wishing Naga Chaitanya On His Birthday - Sakshi
Sakshi News home page

Samantha: ఎందుకిలా చేశావంటూ సమంతపై నెటిజన్ల ఫైర్‌!

Nov 24 2021 6:21 PM | Updated on Nov 24 2021 9:33 PM

Netizens Trolls Samantha on Social Media for Not Wishing Naga Chaitanya - Sakshi

పెంపుడు కుక్కకు అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు చై కోసం ఒక్క పోస్ట్‌ పెట్టలేకపోయావా? అని సామ్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నారు...

Samantha: టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత తన పెంపుడు కుక్క హష్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపింది. ఆ శునకంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఫొటోలు పెట్టింది. ఆ కుక్క మీద అంత ప్రేమ కురిపిస్తున్న సామ్‌ తన మాజీ భర్తకు ఎందుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని నిలదీస్తున్నారు నెటిజన్లు. నిన్న(నవంబర్‌ 23) నాగచైతన్య పుట్టినరోజు. ఎవరెవరో ఆయనకు బర్త్‌డే విషెస్‌ చెప్పారు, కానీ సామ్‌ మాత్రం విష్‌ చేయలేదు. ఇది చాలామంది నెటిన్లకు నచ్చలేదు. చైకి శుభాకాంక్షలు చెప్తే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు.

భార్యగా కాకపోయినా కనీసం స్నేహితురాలిగానైనా విష్‌ చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. పెంపుడు కుక్కకు అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు చై కోసం ఒక్క పోస్ట్‌ పెట్టలేకపోయావా? అని సామ్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. మమ్మల్ని ఎందుకిలా నిరాశపర్చావంటూ కామెంట్‌ చేస్తున్నారు. కాగా సమంత ప్రస్తుతం 'శాకుంతలం' సినిమాతో పాటు తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ చిత్రంలో నటిస్తోంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి సైతం సంతకం చేసింది. అలాగే అల్లు అర్జున్‌ పుష్ప చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్పులేయనుంది.

చదవండి: సమంత వెక్కివెక్కి ఏడ్చిన ఘటనలు మాకింకా గుర్తున్నాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement