నాకెందుకు ప్రపోజ్‌ చేయలేదురా బాబు: అనసూయ | Netizens Respond On Anasuya Bharadwaj Instagram Video | Sakshi
Sakshi News home page

నాకెందుకు ప్రపోజ్‌ చేయలేదురా బాబు: అనసూయ

Apr 3 2021 9:01 PM | Updated on Apr 4 2021 7:54 PM

Netizens Respond On Anasuya Bharadwaj Instagram Video - Sakshi

ప్రముఖ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ బుల్లితెర యాంకర్‌గా రాణిస్తునే ఇటూ వెండితెరపై అందాలు బోస్తుంది. తనదైన యాంకరింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాల్లో కూడా మహిళ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వరుసగా సినిమా అవకాశాలను చేజిక్కించుకుంటోంది. ఇక యాంకర్‌గా బుల్లితెరపై ఆమె చేసే ఓవరాక్షన్‌ అంతా ఇంతా కాదు. ఆమె చేసే ఓవరాక్షన్‌కు పడిపోయే వారు ఎంతమంది ఉన్నారో తిట్టుకునేవారు కూడా అంతే ఉన్నారు.

ఇక అనసూయ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. నిత్యం తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమాకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అనసూయ. తాజాగా ఈ  యాంకర్మ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. నాగచైతన్య, పూజ హెగ్డే నటించిన ‘ఒక లైలాకోసం’ సినిమాలోని హీరోయిన్‌ డైలాగ్‌ను అనుకరించింది. ఇందులో పూజా తన మేల్‌ ఫ్రెండ్స్‌కు కాల్‌ చేసి ‘ఎప్పుడు నాకెందుకు ప్రపోజ్ చేయలేదురా’ అని అడిగే సన్నివేశం గుర్తుంది కదా.

ఆ డైలాగ్‌కు ఇప్పుడు అనసూయ తన అభినయాన్ని జోడించింది. ‘నాకెందుకు ప్రపోజ్‌ చేయలేదురా అంటూ సాగే ఈ ఫన్నీ డైలాగ్‌పై ఓ వీడియోను చేసి షేర్‌ చేసింది. ఇక ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఐ లవ్ యు అనసూయ’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ‘మీకు పెళ్లయింది కదా ఒప్పుకుంటారా లేదో అని ప్రపోజ్ చేయలేదు’ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అటు అనసూయ టీవీ షోలతో పాటు ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా అయిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement