Nayanthara Vignesh Shivan Invite TN CM MK Stalin To Their Wedding, Pic Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Nayanthara Vignesh Shivan: సీఎంను కలిసిన నయనతార.. ఫొటో వైరల్‌..

Jun 5 2022 11:52 AM | Updated on Jun 5 2022 3:33 PM

Nayanthara Vignesh Shivan Invite TN CM MK Stalin To Their Wedding Pic Viral - Sakshi

సౌత్‌ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా కీర్తి గడించింది నయనతార. ఆమె ప్రముఖ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాదిన వీరిద్దరి పెళ్లి హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఈ పెళ్లి వార్తలు నిజమేనని ఈ జంట తాజాగా స్పష్టం చేసింది.

Nayanthara Vignesh Wedding: సౌత్‌ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా కీర్తి గడించింది నయనతార. ఆమె ప్రముఖ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాదిన వీరిద్దరి పెళ్లి హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఈ పెళ్లి వార్తలు నిజమేనని ఈ జంట తాజాగా స్పష్టం చేసింది. శుక్రవారం (జూన్ 3) సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసిన ఈ లవ్‌ బర్డ్స్‌ తమ వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌కు అందజేసింది. తమ వివాహానికి హాజరు కావల్సిందిగా కోరారు. వారిని అభినందించిన సీఎం స్టాలిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. స్టాలిన్‌తో పాటు ఆయన కుమారుడు హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ కూడా ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. 

ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేష్‌ శివన్‌ల నిశ్చితార్తం కుటుంబసభ్యుల సమక్షంలో గతేడాది జరిగింది. తాజాగా మహాబలిపురంలోని మహబ్‌ హోటల్‌లో జూన్‌ 9న వీరి పెళ్లి వేడుక జరగనుంది. ఈ వివాహానికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు గెస్ట్‌లకు 'డిజిటల్ వీడియో ఇన్విటేషన్‌ కార్డ్‌' పంపించినట్లు తెలుస్తోంది. కాగా వీరి పెళ్లి తిరుమలలో జరగుతుందని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో మహాబలిపురంలోని మహబ్‌ హోటల్‌లో హిందూ సాంప్రదాయాల ప్రకారం నయన్‌, విఘ్నేష్‌ వివాహం జరగనుంది. అయితే ఇదే వేదికపై జూన్‌ 8న సాయంత్రం సౌత్‌ ఇండియా సినీ పరిశ్రమలోని ప్రముఖులు, రాజకీయవేత్తల మధ్య రిసెప్షన్‌ గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ రిసెప్షన్‌కు రజనీ కాంత్, కమల్‌ హాసన్‌, విజయ్, అజిత్, సూర్య, కార్తీ, శివకార్తికేయన్‌, విజయ్‌ సేతుపతికి ఆహ్వానం అందినట్లు టాక్‌. 

చదవండి: కాస్ట్‌లీ గిఫ్ట్‌తో సమంతను సర్‌ప్రైజ్‌ చేసిన నయనతార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement