OTT: ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ ఎలా ఉందంటే? | Nayanthara: Beyond The Fairy Tale Review In Telugu | Sakshi
Sakshi News home page

Nayanthara: Beyond The Fairy Tale Review: ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ ఎలా ఉందంటే?

Published Mon, Nov 18 2024 10:24 AM | Last Updated on Mon, Nov 18 2024 10:43 AM

Nayanthara: Beyond The Fairy Tale Review In Telugu

నయనతార జీవిత ఆధారంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ తెరకెక్కించిన డ్యాక్యుమెంటరీ సిరీస్‌‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’.   అమిత్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ నేటి(నవంబర్‌ 18) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఒక గంట ఇరవైరెండు నిమిషాల నిడివిగల ఈ డ్యాక్యుమెంటరీ సిరీస్‌ ఎలా ఉంది? అందులో ఏం చూపించారు?

🔸నయనతార జీవితం మొత్తాన్ని ఓ బ్యూటిఫుల్‌ స్టోరీగా మలిచి తెరపై అందంగా చూపించే ప్రయత్నం చేసింది నెట్‌ఫ్లిక్స్‌

🔸నయనతార చిన్నప్పటి ఫోటోలను చూపుతూ..ఆమె స్కూల్‌ డేస్‌ సీన్‌తో ఈ డ్యాక్యుమెంటరీ ప్రారంభం అవుతుంది.

🔸ఆమెకు సినిమా చాన్స్‌ ఎలా వచ్చింది? మాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌కి ఎలా ఎంట్రీ ఇచ్చిందనేది ఆయాన డైరెక్టర్లతో చెప్పించారు.

🔸కెరీర్‌ తొలినాళ్లతో నయనతార పడిన ఇబ్బందులను, బాడీ షేమింగ్‌ చేసినప్పుడు తను పడిన మానసిక క్షోభను పంచుకున్నారు.

🔸తన పర్సనల్‌ లైఫ్‌పై వచ్చిన కొన్ని విమర్శల కారణంగా సినిమా చాన్స్‌లు కోల్పోయినా.. తిరిగి ఎలా ట్రాక్‌లోకి వచ్చారనేది ఆసక్తికరంగా తెలియజేశారు.

🔸శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్రకు నయనతారను తీసుకున్నప్పడు వచ్చిన విమర్శలను చూసి ఆమె ఎంత బాధపడిందనే విషయాలను ఆయా దర్శక నిర్మాతలతో చెప్పించారు.

🔸తనపై వచ్చిన విమర్శలన్నింటిని పక్కన పడేసి.. ‘లేడీ సూపర్‌ స్టార్‌’గా ఎలా ఎదిగారనేది ఆసక్తికరంగా చూపించారు.

🔸ఫస్టాఫ్‌ మొత్తం నయనతార బాల్యం, సినీ కెరీర్‌ని చూపించి..సెకండాఫ్‌లో విఘ్నేశ్‌తో ప్రేమాయణం ఎలా మొదలైంది? వివాహ జీవితం ఎలా ఉందనేది చూపించారు.

🔸‘నానుమ్‌ రౌడీ దాన్‌’సమయంలో వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయి? విఘ్నేశ్‌కి నయన్‌ ఎలాంటి సపోర్ట్‌ని అందించింది? ఎలా ప్రేమలో పడిపోయారనేది చక్కగా చూపించారు.

🔸పెళ్లికి ముందు వీరిద్దరి రిలేషన్‌షిప్‌ ఎలా కొనసాగిందో అనేది వారి మాటల్లోనే చూపించారు. ప్రేమలో ఉన్నప్పడు వారిపై వచ్చిన మీమ్స్‌ గురించి కూడా సరదాగా పంచుకున్నారు.

🔸గ్లాస్‌ హౌస్‌లోనే నయనతార ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? పెళ్లి రోజు వీరిద్దరు ధరించిన దుస్తుల వెనున ఉన్న కథ, వాటిని తయారు చేయడానికి డిజైనర్లు పడిన కష్టాలను చూపించారు.

🔸ఇక ఈ డ్యాక్యుమెంటరీ చివరల్లో నయనతార-విఘ్నేశ్‌ల  కవల పిల్లలను చూపిస్తూ.. ఆహ్లాదకరమైన ముగింపును ఇచ్చారు.

🔸మొత్తంగా ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ సిరీస్‌ సరదాగా సాగుతూ.. నయనతార లైఫ్‌లో చోటు చేసుకున్న కొన్ని వివాదాలు.. విమర్శలను చూపిస్తూనే..వాటిని ఎదుర్కొని ఎలా ‘లేడీ సూపర్‌స్టార్‌’గా ఎదిగారనేది చూపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement