పుట్టినరోజుకి ముందు అవార్డు అందుకున్నాను: నటి ఆశా పారేఖ్‌ 

National Award: Asha Parekh Receives Dada Saheb Phalke Award - Sakshi

దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్న ఆశా పారేఖ్‌ 

ఉత్తమ నటులు సూర్య, అజయ్‌ దేవగన్‌ 

‘సూరరై పోట్రు’ సినిమాకు ఐదు అవార్డులు 

68వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అవార్డులను ప్రదానం చేశారు. 2020కి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును నటి ఆశా పారేఖ్‌ అందుకున్నారు. ‘‘నా 80వ పుట్టినరోజుకు ముందు ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఆశా పారేఖ్‌. జాతీయ ఉత్తమ నటులుగా సూర్య (‘సూరరై పోట్రు’), అజయ్‌ దేవగన్‌ (తన్హాజీ) అవార్డులు అందుకున్నారు. తమిళ ‘సూరరై పోట్రు’ ఉత్తమ సినిమా అవార్డుతో పాటు ఐదు అవార్డులు గెలుచుకుంది.

ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును ఈ చిత్రదర్శకురాలు సుధ కొంగర, బెస్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అవార్డును జీవీ ప్రకాష్‌ కుమార్, ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళి అవార్డులు అందుకున్నారు. ‘అల వైకుంఠపురములో..’కి గాను జాతీయ ఉత్తమ సంగీతదర్శకుడిగా ఎస్‌ఎస్‌ తమన్, బెస్ట్‌ తెలుగు ఫిలిం ‘కలర్‌ ఫొటో’కు దర్శకుడు అంగిరేకుల సందీప్‌ రాజు, నిర్మాత సాయి రాజేశ్‌ అవార్డులు అందుకున్నారు. ‘నాట్యం’ సినిమాకు బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌ అవార్డును నటి సంధ్యారాజు, బెస్ట్‌ మేకప్‌ ఆరి్టస్ట్‌ అవార్డును రాంబాబు అందుకున్నారు. 

⇔ సినీ రంగంలో ప్రస్తుతం సృజనాత్మకతకు స్వేచ్ఛ ఉంది. సినీ నిర్మాణం, కథా రచయితలు సినిమాను  చూసే విధానానికి ఇది స్వర్ణ యుగంలాంటిది -సుధ కొంగర 

⇔ ‘అల వైకుంఠపురములో..’ అనుకున్న మొదటి రోజు నుంచి త్రివిక్రమ్, బన్నీ (అల్లు అర్జున్‌) ఇచి్చన ఎనర్జీ వల్లే ఈ అవార్డు సాధ్యమైంది. ఈరోజు ఇక్కడ అవార్డు అందుకోవడం గ్రేట్‌గా అనిపిస్తోంది. ఇదంతా దేవుడి దయ- ఎస్‌.ఎస్‌. తమన్‌ 

⇔ వర్ణ వివక్ష గురించి తీసిన మా ‘కలర్‌ ఫొటో’కు అవార్డు రావడం ఆనందంగా ఉంది. కోవిడ్‌ వల్ల థియేటర్లలో సినిమా విడుదల చేయలేదు. ఆ బాధ ఈ జాతీయ అవార్డు రావడంతో పోయింది -నీలం సాయి రాజేష్‌


⇔ ప్రతీ మూడు నెలలకోసారి మా సినిమాకు ఏదో ఒక రూపంలో అవార్డులు రావడం హ్యాపీగా ఉంది. – సందీప్‌ రాజు


⇔ లాక్‌డౌన్‌ కారణంగా రెండేళ్లు సినిమా కోసం కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. – రాంబాబు 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top