నార్నే నితిన్‌ కొత్త సినిమా షురూ | Narne Nithin new movie launched | Sakshi
Sakshi News home page

నార్నే నితిన్‌ కొత్త సినిమా షురూ

Published Fri, Jul 14 2023 4:12 AM | Last Updated on Fri, Jul 14 2023 4:12 AM

Narne Nithin new movie launched - Sakshi

హీరో ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌ హీరోగా కొత్త సినిమా షురూ అయింది. అంజిబాబు కంచిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో నయన్‌ సారిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది.

తొలి సన్నివేశానికి నిర్మాత ‘దిల్‌’ రాజు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టారు. డైరెక్టర్‌ చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకుడు మారుతి స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు. ‘‘జీఏ 2 బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది’’ అన్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి సహనిర్మాత: ఎస్‌కేఎన్, కెమెరా: సమీర్‌ కళ్యాణ్, సంగీతం: రామ్‌ మిర్యాల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: భానుప్రతాప్, రియాజ్‌ చౌదరి, అజయ్‌ గద్దె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement