'అన్నీ మంచి శకునములే' అంటోన్న నందినీ రెడ్డి | Sakshi
Sakshi News home page

నందినీ రెడ్డి డైరెక్షన్‌లో ఛాన్స్‌ కొట్టేసిన సంతోష్‌ శోభన్‌

Published Mon, Jul 5 2021 8:51 PM

Nandini Reddys Next Film Anni Manchi Sakunamule Title Announced - Sakshi

'ఏక్ మినీ కథ'  సినిమాతో హిట్‌ కొట్టిన కుర్ర హీరో సంతోష్‌ శోభన్‌. ఈ మూవీ సక్సెస్‌తో జోష్‌ మీదున్న ఈ యంగ్‌ హీరో ఇప్పుడు మరో క్రేజీ మూవీతో ముందుకు వస్తున్నాడు. నందినీ రెడ్డి దర్వకత్వంలో ఓ మూవీ సైన్‌ చేసినట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూమర్స్‌ను నిజం చేస్తూ నందినీ రెడ్డి ఈ ప్రాజెక్టును అఫిషియల్‌గా అనౌన్స్‌ చేసింది. తాను డైరెక్ట్‌ చేసిన ఓ బేబీ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్‌ చేయడం సంతోషంగా ఉందని నందినీ రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.


ఇక ఈ సినిమాకు 'అన్నీ మంచి శకునములే' అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌ . స్వప్న సినిమా, మిత్ర వింద మూవీస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సంతోష్‌ శోభన్‌కు జంటగా మళవిక  నాయర్ హీరోయిన్‌గా నటించనుంది. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే హీరో సంతోష్‌ శోభన్‌.. మారుతి దర్శకత్వంలో ఓ ప్రాజెక్టుకు సైన్‌ చేసిన సంగతి తెలిసిందే. మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటించనుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement