‘మహేష్‌ ఇంట్లో లేకుంటే ఎక్కడ ఉంటారో తెలుసా’ | Namrata Shirodkar Posted A Video Of Mahesh Running On Treadmil | Sakshi
Sakshi News home page

‘మహేష్‌ ఇంట్లో లేకుంటే ఎక్కడ ఉంటారో తెలుసా’

Aug 20 2020 8:32 AM | Updated on Aug 20 2020 9:50 AM

 Namrata Shirodkar Posted A Video Of Mahesh Running On Treadmil - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలతోపాటుగా.. మహేష్‌ సినీ విశేషాలను కూడా ఆమె అభిమానులతో పంచుకుంటారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో.. మహేష్‌ కూడా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ప్రస్తుతం సినమా షూటింగ్‌లను అనుమతినిచ్చిన మహేష్‌ మాత్రం ఇప్పట్లో షూటింగ్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మహేష్‌ ప్రస్తుతం కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. పిల్లలతో సరదాగా ఆడుకుంటున్నారు. (అతనితో స్నేహం చేస్తా: నమ్రతా శిరోద్కర్‌)

తాజాగా ప్రిన్స్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని నమ్రత పేర్కొన్నారు. ఆయన ఇంట్లో లేకుంటే ఎక్కడ ఉంటారో వివరించారు. ‘మహేష్‌ ఒకవేళ ఇంట్లో కనిపించకుంటే ఖచ్చితంగా ఎక్కడ ఉంటారో తెలుసు.. ఇంట్లోని జిమ్‌.. ఇక్కడే రోజంతా గడుపుతారు. పర్‌ఫెక్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌’. అంటూ మహేష్‌ జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్న వీడియోను బుధవారం నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. కాగా ఇంతకముందు కూడా మహేష్‌ జిమ్‌లో ఉన్న ఫోటోలను నమ్రతా సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. (‘మహేష్‌ బాబు ఇది మీ కోసమే’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement