మెగా హీరోకు నాగార్జున భారీ రెమ్యూనరేషన్‌, ఎంతంటే!

Nagarjuna Akkineni Pay Big Amount For Vaishnav Tej For A Movie - Sakshi

స్టార్‌ హీరో నాగార్జున్‌ అక్కినేని మెగా హీరోకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్‌ ముట్టజెపుతున్నట్లుగా వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. కాగా నాగార్జున ఇండస్ట్రీలో హీరోగానే కాక నిర్మాతగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సొంత బ్యానర్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో పలు సినిమాలు, సీరియల్స్‌, షోలో నిర్వహిస్తుంటాడు. తన బ్యానర్‌లో నటించే నటీనటులకు పారితోషికంలో ఎలాంటి బేరాలు ఉండవు. ఆ షో, సినిమాను బట్టి నటుల డిమాండ్‌ను చూసి పారితోషికం అందిస్తాడు నాగ్‌. 

ఈ క్రమంతో తాజాగా మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌కు కూడా ఏకంగా 5 కోట్ల రూపాలయ పారితోషికం ఇస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌. కాగా తొలి సినిమా ‘ఉప్పెన’తో భారీ హిట్‌ ఖాతాలో వేసుకున్న వైష్ణవ్‌ ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించాడు. దీంతో దర్శక-నిర్మాతలు క్యూ కడుతూ వైష్ణవ్‌కు అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున సైతం వైష్ణవ్‌తో ఓ మూవీ ప్లాన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్‌ నేపథ్యంలో సాగే ఈ మూవీలో వైష్ణవ్‌ హాకీ ఆటగాడిగా కనిపించనున్నాడట. ఈ మూవీతో పృథ్వీ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. కాగా వైష్ణవ్‌, క్రిష్‌ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top