ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్‌ మీనింగ్‌ ఉండదు : నాగచైతన్య

Naga Chaitanya Interesting Comments On Double Meaning Words - Sakshi

తాను ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్తానని, డబుల్‌ మీనింగ్‌లో మాట్లాడడం రాదని నాగచైతన్య అన్నారు. చైతూ, రాశీఖన్నా జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా నాయర్‌, అవికా గోర్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జులై 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నాగచైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

(చదవండి: గాడ్‌ ఫాదర్‌ లుక్‌లో అదరగొట్టేసిన చిరంజీవి)

ర్యాపిడ్‌ క్వశ్చన్స్‌ అంటూ ఐదు డబుల్‌ మీనింగ్‌ పదాలు చెప్పాలని చైతూని కోరాడు యాంకర్‌. దీనికి చైతూ తనదైన శైలీలో సమాధానం ఇచ్చాడు. తనకు డబుల్‌ మీనింగ్‌ పదాలు తెలియవని, ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్తానని అన్నారు. అంతేకాదు డబుల్‌ మీనింగ్‌ పదాలు ఏంటో నువ్వే చెప్పు అని తిరిగి యాంకర్‌ని ప్రశ్నించారు.  దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top