ఓటీటీకి 800 మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Muttiah Muralitharan Biopic Movie 800 Ott Streaming Date Fix - Sakshi

శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించి చిత్రం '800'. ఈ చిత్రంలో స్ల‌మ్ గాడ్ మిలియ‌నీర్ ఫేమ్ మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరేన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా..   మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ సమర్పణలో వివేక్ రంగాచారి నిర్మించారు. అక్టోబ‌ర్ 6న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ సినీ ప్రేక్షకులతో పాటు క్రికెట్ అభిమానుల‌ను అలరించింది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్‌పై అప్‌డేట్ వచ్చేసింది. డిసెంబ‌ర్ 2 నుంచి జియో సినిమాలో ముత్తయ్య మురళీధరన్ బ‌యోపిక్ స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తమిళం, తెలుగుతో పాటు మిగిలిన ద‌క్షిణాది భాష‌ల్లో రిలీజ్ కానుంది. థియేటర్లలో చూడడం మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

800 కథేంటంటే..
ముత్తయ్య మురళీధరన్‌ అంటే 800 వికెట్లు తీసిన ఏకైన క్రికెటర్‌గానే అందరికి తెలుసు.అయితే ఈ 800 వికెట్లు తీయడానికి వెనుక ఆయన పడిన కష్టమేంటి? తమిళనాడు నుంచి వలస వెళ్లి శ్రీలంకలో సెటిల్‌ అయిన మురళీధరన్‌ ఫ్యామిలీ.. అక్కడ ఎలాంటి వివక్షకు గురైంది? వివక్షను, అవమానాలను తట్టుకొని శ్రీలంక జట్టులో చోటు సంపాదించుకున్న మురళీధరన్.. స్టార్‌ క్రికెటర్‌గా ఎదిగిన తర్వాత కూడా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు.

తొలిసారి ఇంగ్లాండ్‌ టూర్‌కి వెళ్లిన మురళీధరన్‌.. జట్టు నుంచి ఎలా స్థానాన్ని కోల్పోయాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో  ‘చకింగ్ ’అవమానాలను ఎలా అధిగమించాడు? తన బౌలింగ్‌పై వచ్చిన ఆరోపణలు తప్పని ఎలా నిరూపించుకున్నాడు? శ్రీలంకలోని ఎల్టీటీఈ సమస్యపై ప్రభాకరన్‌తో ఎలాంటి చర్చలు జరిపాడు? ఆ ఆలోచన ఎలా వచ్చింది? 1000 వికెట్లు తీసే సామర్థ్యం ఉన్నప్పటికీ..ముందుగానే ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ‘800’ సినిమా చూడాల్సిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top